ఇండియన్ జవాన్ లపై ఉగ్రవాదులు పుల్వామా దాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ వర్గాల్లో హడావుడి కనిపిస్తుంది. సర్జికల్ స్ట్రైక్స్ 2 పేరుతో ఎయిర్ ఫోర్స్ ఉగ్ర స్థావరాలపై చేసిన దాడికి సంబంధించిన విషయాలను సినిమా రూపంలో తీసుకు రావాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం పలు టైటిల్స్ ను కూడా రిజిస్ట్రర్ చేసి పెట్టడం జరిగింది. తాజాగా తాప్సి నటించిన 'బద్ల' చిత్రం కోసం కూడా ఉగ్ర దాడులు ఆ తర్వాత జరిగిన పరిణామాలను వినియోగించుకుంటున్నారు.
అమితాబచ్చన్ కీలక పాత్రలో నటించిన 'బద్ల' చిత్రం మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉగ్ర దాడులు, ఎయిర్ ఫోర్స్ దాడుల మీడియా కవరేజ్ సమయంలో 'బద్ల' సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. తాప్సి 'బద్ల' సినిమా ప్రమోషన్ కోసం ఎక్కడకు వెళ్లినా కూడా ఉగ్రదాడుల గురించి మాట్లాడుతూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది.
తమ సినిమా కూడా రివేంజ్ డ్రామానే అని, పుల్వామా ఉగ్ర దాడికి ఇండియన్ ఆర్మీ ఎలా అయితే ప్రతీకారం తీర్చుకుందే తమ సినిమాలో కూడా అలాంటి ప్రతీకార సీన్స్ ఉంటాయని తాప్సి అందరి దృష్టి ఆకర్షిస్తోంది. మొత్తానికి తాప్సి చాలా విభిన్నంగా తన బద్ల సినిమాను ప్రమోట్ చేసుకుంది. ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకుల్లో బద్ల చిత్రంపై ఆసక్తి చాలా ఎక్కువగా ఉంది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.