చియాన్ విక్రమ్ నటించిన అపరిచితుడు- ఐ లాంటి విజువల్ ఫీస్ట్ సినిమాలను అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అపరిచితుడు విక్రమ్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. అలాంటి మ్యాజిక్ ని అతడు మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తాడని అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తారు. ఇప్పటికి ఆ ఎదురు చూపులు ఫలించే రోజొచ్చిందా? అంటే.. అందుకు సమాధానాన్ని విక్రమ్ రెడీ చేస్తున్నాడనే భావించాలి.
తాజాగా విక్రమ్ నటిస్తున్న కోబ్రా టీజర్ ఆశల్ని పెంచింది. ఈ టీజర్ ఆద్యంతం విక్రమ్ వన్ మ్యాన్ షో రక్తి కట్టించింది. అతడు ఆర్థిక నేరాలకు పాల్పడుతూ రకరకాల మారు వేషాల్లో తప్పించుకుని తిరిగే వాడిగా కనిపిస్తున్నాడు. ఇక క్రిమినల్ లెక్కల మాస్టార్ ని వెతుకుతూ కాప్ ఆపరేషన్స్ కూడా అంతే రంజుగా సాగుతున్నాయి. అసలింతకీ లెక్కల మాస్టార్ ఇలా తెగించడం వెనక కారణమేమిటో కూడా తెరపైనే చూడాలి.
విక్రమ్ గణిత ఉపాధ్యాయుడిగా నటించాడు కానీ అతను తన గణిత నైపుణ్యాలను ఉపయోగించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే 'కోబ్రా' పేరుతో అసాధ్యమైన ఆర్థిక నేరాలకు పాల్పడడం రక్తి కట్టించే ఎలిమెంట్ అనే చెప్పాలి. ప్రతి సమస్యకు గణిత పరిష్కారం ఉంటుందని అతను నమ్ముతాడు. నేరాలు పోగుపడుతుండగా కోబ్రాను విచారించడానికి ట్రేస్ చేయడానికి ఒక కాప్ బృందం బరిలోకి దిగుతుంది. కానీ అతడు తప్పించుకుని పారిపోతుంటాడు.
టీజర్ లో విక్రమ్ విభిన్నమైన గెటప్ లతో అలరించాడు. దశావతారంలో కమల్ తరహాలోనే గెటప్పుల పరంగా భారీ ప్రయోగం చేసాడు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ చిత్రంతో తన నటనా రంగ ప్రవేశం చేస్తున్నాడు. అతను అంతర్జాతీయ నేరస్థుడిని పట్టుకోవడానికి నియమించబడిన దర్యాప్తు అధికారిగా కనిపిస్తున్నారు. 'ఐ'లో నీల్ నితిన్ ముఖేష్ తరహాలో అతడి ఆహార్యం ఆకట్టుకుంటోంది.
KGF హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఇందులో కథానాయికగా నటిస్తోంది. తన అందచందాలు ఈ సినిమాకి ప్లస్ గా మారనున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం కోబ్రాకి ప్రధాన ఆయుధం అని చెప్పాలి. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లెక్కల మాస్టారు నేరాల లెక్కల వెనక లాజిక్ ఏంటో దర్శకుడు ఏ కోణంలో రివీల్ చేస్తాడో వేచి చూడాలి.
Full View