ఆ భామలిద్దరికీ పడటం లేదు

Update: 2017-10-14 05:13 GMT
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాల్లో సాధారణంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. ఇమేజ్ తో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రయినా చేయడానికి రెడీ అవడం అమీర్ స్పెషాలిటీ. బాలీవుడ్ టాప్ హీరో అయినా దంగల్ సినిమాలో ఇద్దరు ఎదిగిన కూతుళ్ల తండ్రిగా కనిపించి శభాష్ అనిపించుకున్నాడు. అందుకే బాహుబలికి పోటీగా దంగల్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు కొల్లగొట్టింది.

దంగల్ తర్వాత అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా చేస్తున్నాడు. దీనికి ధూమ్-3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య దర్శకుడు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ ఓ హీరోయిన్ కాగా.. దంగల్ సినిమాలో అమీర్ పెద్దకుమార్తెగా నటించిన ఫాతిమా సనా షేక్ ఇంకో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరికీ క్షణం పడటం లేదనేది బాలీవుడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్. ఎందుకంటే ఫాతిమా కెరీర్ కు ఉపయోగపడేలా సినిమాలో ఆమె క్యారెక్టర్ నిడివి అమీర్ పెంచాడని తెలుస్తోంది. ఈ మూవీలో ముందుగా కమిట్ అయినంది కత్రినానే. అలాంటిది తన పాత్రకు అంత ప్రాధాన్యం ఇవ్వకుండా ఫాతిమా క్యారెక్టర్ కు మెరుగులు దిద్దుతుండటం కత్రినాకు అస్సలు నచ్చడం లేదట.

హీరోయిన్లు ఇద్దరి మధ్య కోల్డ్ వార్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా షూటింగ్ పై ప్రభావం చూపించేలానే ఉంది. ఈ మూవీని వచ్చే ఏడాది దీపావళి నాటికి ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకంటన్నారు. హీరోయిన్లు ఇద్దరూ ఇలాగే ఎడమొహం.. పెడమొహంగా ఉంటే సినిమా ఇంకా లేటవడం ఖాయం. ఇప్పటివరకు ఈ ఇష్యూలో అమీర్ ఎంటరవలేదు. చూద్దాం.. మిస్టర్ పర్ ఫెక్ట్ ఏమంటాడో?
Tags:    

Similar News