'మజిలీ' 'డియర్ కామ్రేడ్' 'ప్రతిరోజూ పండగే' 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న కమెడియన్ సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ''కలర్ ఫోటో''. 'హృదయ కాలేయం' 'కొబ్బరి మట్ట' లాంటి స్పూఫ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ మరియు లౌక్యా ఎంటర్‌టైన్మెంట్స్ బెన్నీ ముప్పనేని కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాకి దర్శకత్వ విభాగంలో పనిచేసిన సందీప్ రాజ్ ''కలర్ ఫోటో'' చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందిస్తున్నారు. సుహాస్ కు జోడిగా తెలుగుమ్మాయి ఛాందినీ చౌదరి నటిస్తుండగా వైవా హర్ష ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో సీనియర్ కమెడియన్ సునీల్ పూర్తి స్థాయి విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన 'కలర్ ఫోటో' ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో లేటెస్టుగా ఈ చిత్రానికి సంబంధించిన ఆఫీసియల్ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
కాగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘కలర్ ఫోటో’ మూవీ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ''నాలాగా నల్లగున్నోడు మీలాంటి అందమైన అమ్మాయిని ప్రేమిస్తే పక్కనున్న ఫ్రెండ్సే ఎగతాళి చేస్తారు. ఒకడు బ్లాక్ అండ్ వైట్ అంటాడు.. ఒకడు గులాబ్ జామ్ రసగుల్లా అంటాడు. ఒకడేమో ఆశకు హద్దుండాలి.. గు.. సారీ.. అమ్మాయిల ముందు బూతులు మాట్లాడకూడదు'' ''అబ్బాయిల సెలక్షన్ బాగానే ఉంటదిరా కానీ లవ్ సరిగ్గా చేయలేరు.. అమ్మాయిలు లవ్ చేస్తారు కానీ సెలక్షనే..'' అనే డైలాగ్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. సుహాన్ తెల్లగా కనిపించడం కోసం చేసే ప్రయత్నాలు.. పేస్ చూపించకూడదని ఖర్చీఫ్ కట్టుకోవడాలు లాంటివి టీజర్ లో చూపించారు. ఇక సునీల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ గా కనిపించాడు. మొత్తం మీద 'కలర్ ఫోటో' టీజర్ అన్ని రకాల ఎమోషన్స్ తో కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
Full View