ఫొటోటాక్‌ : గుర్తు పట్టలేనంత మారిన కమెడియన్‌

Update: 2020-09-04 11:30 GMT
తమిళంలో వడివేలు తర్వాత ఆ స్థాయి కమెడియన్‌ గా గుర్తింపు దక్కించుకున్న సంతానం హీరోల స్థాయి స్టార్‌ డం దక్కించుకున్నాడు. అదే సమయంలో ఈయన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా అనూహ్యంగా విజయాలు దక్కడంతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి ఫలితాలను సాధించాయి. ప్రస్తుతం ఈయన చేతిలో రెండు సినిమాలున్నాయి. త్వరలో వాటిల్లో ఒక సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న సంతానం ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. ఇతడిని సినిమాలో చూసిన వారు ఇప్పుడు చూస్తే అతడు ఇతడేనా అన్నట్లుగా ఆలోచనలో పడతారు. తన గడ్డంతో మొత్తం లుక్‌ ను మార్చేశాడు. అలాగే హీరో అయినప్పటి నుండి కూడా రెగ్యులర్‌ గా వర్కౌట్స్‌ చేయడంతో పాటు డైట్‌ ఫాలో అవుతున్నాడు. దాంతో హీరో మాదిరిగా సంతానం కనిపిస్తున్నాడు అంటూ ప్రేక్షకులు అంటున్నారు. గడ్డం మరియు జుట్టు ఇంతగా పెంచడానికి కారణం ఏంటీ అనే విషయంలో సంతానం నుండి ఎలాంటి స్పందన రాలేదు. కాని ఈ కొత్త లుక్‌ మాత్రం తమిళ జనాల్లోనే మాత్రం కాకుండా ఇక్కడ కూడా చర్చనీయాంశం అయ్యింది.
Tags:    

Similar News