సైబర్ క్రైం పోలీసులకు అలీ ఫిర్యాదు

Update: 2020-07-19 04:37 GMT
ఎన్నికల వేళ రెండు పార్టీల్లో ఉన్న ప్రాణ స్నేహితులు పవన్ కళ్యాణ్, అలీలు విడిపోయారు.. విమర్శించుకున్నారు. ఎన్నికలు అయిపోయాయి.. ఎవరి దుకాణం వారు చూసుకున్నారు..  ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయి. పవన్ పై అలీ సానుకూలంగానే స్పందిస్తున్నారు. మా ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఇటీవల ఓ ప్రోగ్రాంలో చెప్పారు.

అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని అడ్వాన్స్ గా అతడిని పొగుడుతూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది.. ‘వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు... ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు.’ అంటూ  లవ్ సింబల్ పెట్టి కమెడియన్ అలీ పేరుతో ఓ  పోస్ట్ వైరల్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ పెట్టిన ‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్’ హ్యాష్ ట్యాగ్ కు మద్దతుగా ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు పోస్టు చేశారు.

ఈ ట్వీట్ పై జనసైనికులు.. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పవన్ ను తిట్టి ఇప్పుడు మీరు ప్రశంసించినా ఆ మాటలు మరిచిపోలేం అంటూ అలీపై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు అలీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ జనసైనికులు ఫైర్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా అలీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. తన పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాను తొలగించాలని.. తన పేరుతో ట్వీట్లు చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. ఫేక్ అకౌంట్లతో తలనొప్పి ఎక్కువైందని.. త్వరలోనే తాను ట్విట్టర్ లోకి వస్తానని అలీ తెలిపారు.

కాగా పోలీసులు కూడా స్పందించారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేస్తామని అలీకి హామీ ఇచ్చారు.
Tags:    

Similar News