తెలుగు తెరపై కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా 'అలీ' కనిపిస్తాడు. కార్తీక్ 'సీతాకోక చిలుక' సినిమాలోని అల్లరి బ్యాచ్ లో అందరికంటే చిన్నవాడిగా అలీని చూసినవాళ్లు, ఈ కుర్రాడెవరో వృద్ధిలోకి వస్తాడని అనుకున్నారు. అలాగే అలీ తన వయసుతో పాటే నటనలో .. జీవితంలో ఎదుగుతూ ముందుకు వెళ్లాడు. హీరోగానూ సక్సెస్ లను అందుకున్న అలీ, తను నమ్ముకున్న కామెడీని మాత్రం వదిలిపెట్టలేదు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా మారాడు. తానే హీరోగా ఒక సినిమా కూడా చేశాడు .. ఆ సినిమా పేరే 'అందరూ బావుండాలి .. అందులో నేనుండాలి'.
'అలీవుడ్' బ్యానర్ పై అలీ తొలిసారిగా నిర్మిస్తున్న సినిమా కావడంతో, సూపర్ స్టార్ కృష్ణగారిని కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నాడు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ .. "నేను ఇండస్ట్రీకి వచ్చి 42 సంవత్సరాలు అయింది. 'సిరిమల్లే నవ్వింది' సినిమాలో నేను మొదటిసారిగా కృష్ణగారితో కలిసి నటించాను. ఆయనతో కలిసి దాదాపు 45 సినిమాలవరకూ చేశాను. వాటిలో విజయనిర్మల గారి దర్శకత్వంలో చేసిన సినిమాలే ఓ అరడజను వరకూ ఉంటాయి. కృష్ణగారి ఆశీస్సులతో మీ ముందుకు నిర్మాతగా కూడా వస్తున్నందుకు సంతోషంగా ఉంది.
'అందరూ బావుండాలి అందులో నేనుండాలి' సినిమా 90 శాతం వరకూ షూటింగు అయింది. డబ్బింగ్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఇంకో 20 రోజుల్లో రీ రికార్డింగ్ .. మిక్సింగ్ .. ఇవన్నీ పూర్తి చేసుకుని, మే మొదటివారంలోగానీ .. రెండవవారంలో గాని ఫస్టుకాపి మా చేతికి వస్తుంది. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎలా ఉందో అందరికీ తెలిసిందే. థియేటర్లకు రావడానికి జనాలు భయపడుతున్నారు .. ఆ భయం పోయిన తరువాతనే ఈ సినిమాను థియేటర్ కి తీసుకురావాలని అనుకుంటున్నాము" అంటూ చెప్పుకొచ్చాడు.