మరో పది రోజుల్లో ఎన్టీఆర్ కథానాయకుడి సందడి మొదలైపోతుంది. నందమూరి అభిమానులు ఈ రోజులు ఎప్పుడెప్పుడు గడిచిపోతాయా అని ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి రేస్ లో మొదటి సినిమా కాబట్టి సాధారణ ప్రేక్షకులు సైతం దీని మీద బాగా ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పటికే కావాల్సిన బజ్ ని ట్రైలర్ పోస్టర్స్ రూపంలో తెచ్చేసుకున్న ఎన్టీఆర్ అంచనాలు అందుకుంటే వసూళ్ల జాతరకు అడ్డుకట్ట ఉండదు. కాకపోతే పోటీలో మరో మూడు క్రేజీ మూవీస్ ఉన్నాయి కాబట్టి అదంత ఈజీగా అయితే ఉండదు.
ఇప్పటికే ఇందులో నటించిన భారీ తారాగణం అంచనాలు రెట్టింపు చేసింది. ముఖ్యంగా కొందరు కమెడియన్లకు సైతం మంచి వేషాలు దక్కడం వాళ్లకు కెరీర్ బ్రేక్ ఇచ్చేలా ఉండొచ్చని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. అందులో భద్రం కూడా ఉన్నాడు. విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ తో ఆకట్టుకునే భద్రం ఇందులో పేకేటి శివరాం గా నటించాడు. ఇది కథానాయకుడి ప్రస్థానంలో కీలక పాత్ర అని చెప్పొచ్చు. అప్పట్లో ఎన్టీఆర్ కు ఎఎన్ ఆర్ కు ఈయనే మధ్యవర్తిగా వ్యవహరించేవారట. ఏదైనా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా ఈయనకే కబురు వెళ్లేదని ఇండస్ట్రీ టాక్.
నాగేశ్వరరావు గారి దేవదాస్ తో కెరీర్ ప్రారంభించిన శివరాం చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ చిరకాలం గుర్తుండిపోయే అద్భుతమైన పాత్రలు పోషించారు. తర్వాత కాలంలో ప్రొడక్షన్ మేనేజర్ గా కూడా వ్యవహరించారు. సుప్రసిద్ధ ఆర్ట్ డైరెక్టర్ పేకేటి రంగా ఈయన కుమారుడే. వినయ విధేయ రామలో రామ్ చరణ్ కు అన్నయ్యగా నటించిన జీన్స్ ప్రశాంత్ స్వయానా శివరాంకు మనవడు. సో ఇలా చాలా రకాలుగా శివరాంకు ఎన్టీఆర్ తో బలమైన కనెక్షన్ ఉంది. దానికి తగ్గట్టు సన్నివేశాలు కనక భద్రంకు ఉంటే మాత్రం ఇది మంచి బ్రేక్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
Full View