కరోనా ప్రతిదీ మార్చేసింది. ముఖ్యంగా ఉపాధిని దెబ్బ కొట్టింది. సినీఇండస్ట్రీకి అయితే కోలుకోలేని దెబ్బ పడింది. నటీనటులు సహా కార్మికులకు సరైన అవకాశాల్లేవ్. దీంతో పలువురు రకరకాల ఇతర ఉపాధి మార్గాలను వెతుక్కున్నారు.
ఇప్పుడు హాస్య నటుడు రఘు కారుమంచి ఎన్నుకున్న ఉపాధి షాకిస్తోంది. అతడు ఫ్రెండ్స్ తో కలిసి మద్యం వ్యాపారంలోకి ప్రవేశించాడు. మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న అతని సన్నిహితులు సాయిరాం రెడ్డి- హరినాథ్ రఘును సంప్రదించటంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల వేలంలో పాల్గొని రెండు షాపులను దక్కించుకున్నారు. నల్గొండ సరిహద్దుల్లో మర్రిగూడ బైపాస్ వద్ద అభినవ్ లిక్కర్స్ పేరుతో వీరంతా దుకాణం తెరిచారు. బుధవారం ఈ లిక్కర్ షాప్ ను ఆరంభించారు. రఘు తన మద్యం దుకాణం కౌంటర్ లో నిలిచి అమ్మకాలు సాగిస్తున్న ఫోటోగ్రాఫ్ వైరల్ గా మారింది.
రఘు తొలుత సాఫ్ట్ వేర్ ఇంజినీర్. నటుడు అయ్యాక కెరీర్ బీజీ అయ్యింది. 2002లో ఆది చిత్రంతో కెరీర్ ప్రారంభించి చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించాడు. హాస్య నటుడిగా పెద్ద స్థాయికి ఎదిగాడు. జబర్ధస్త్ షోలో రోలర్ రఘు గా టీమ్ లీడ్ చేశాడు. అయితే కరోనా సమయంలో వ్యవసాయంలోకి దిగాడు. సేంద్రియ వ్యవసాయం చేసేందుకు హైదరాబాద్ ఔటర్ లో కౌలుకు 10 ఎకరాలు తీసుకున్నాడు. లాక్ డౌన్ సమయంలో నటుడిగా అవకాశాల్లేక తిరిగి సాఫ్ట్ వేర్ రంగంలోకి వెళ్లాలా అనుకుని చివరికి మద్యం దుకాణం తెరిచాడట. ఎంచుకున్న రంగం ఏదైనా కానీ.. అతడు ఘనవిజయం సాధించాలని కోరుకుందాం.