పోలీసుల అదుపులో కమెడియన్ చిచ్చా చార్లెస్.అసలేం జరిగిందంటే..?

Update: 2021-12-02 15:30 GMT
వివిధ పనుల నిమిత్తం భారత్ లో అక్రమంగా ఉంటున్నవారి పని పట్టారు హైదరాబాద్ పోలీసులు. ఇందులో భాగంగా వీసా గడువు ముగిసినా అక్రమంగా నివాసం ఉంటున్న వారి కోసం శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో నైజిరియా దేశస్తులు పట్టుబడ్డారు. 40 ఇళ్లల్లో ఏకకాలంలో పోలీసులు తనిఖీలు చేయడంతో 25 మంది అక్రమంగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది. దీంతో వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తమ వీసా గడువు ముగిసినా ఇక్కడే తిష్ట వేశారు. ఈక్రమంలో యుగాండాకు చెందిన చార్లెస్ చిచ్చాకూడా పట్టుబట్టారు. ఇంతకీ చార్లెస్ చిచ్చా ఎవరంటే..?

చార్చెస్ చిచ్చాను అరెస్టు చేశారన్న వార్త తెలియనగానే వినోద రంగానికి చెందిన వారు షాక్ తిన్నారు. యుంగాడాకు చెందిన చార్లెస్ చిచ్చా పై చదువుల కోసం వరంగల్ కు వచ్చాడు. ఆ తరువాత పలు ఎంటర్ టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. సగంసగం తెలుగుతో అందరినీ ఆకట్టుకోవడంతో పాపులర్ అయ్యాడు. దీంతో అతడికి ఈటీవీలో ప్రసారమయ్యే బజర్దస్త్ షో లో ఆఫర్ వచ్చింది. ఈ షో తో మరించి పాపులారిటీ తెచ్చుకున్నాడు. తన మాటలతో ప్రేక్షకులను అలరించాడు.

అయితే చార్లెస్ చిచ్చా వీసా గడువు ముగిసి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంకా ఇక్కడే ఉంటున్నాడు. దేశం విడిచి వెళ్లడం లేదు. ఆయనతో పాటు నైజిరియా, కాంగో, ఆఫ్రికా, సోమాలియా దేశానికి చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు వీరంతా తమ వీసా గడువు పూర్తయినా ఇక్కడే తిష్టవేశారు. వీరిపై పోలీసులు ఏకకాలంలో దాడులు చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంతో వారి లిస్టు తయారు చేసిన వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

2017లో భారత్ కు వచ్చిన చార్లెస్ చిచ్చా వరంగల్ లోని భీ పార్మసీలో చదువుతున్నాడు. వచ్చీ రాని తెలుగుతో అందరినీ ఆకట్టుకున్ానడు. అయితే ఆఫ్రీకా జాతీయుడైనా తెలుగువాడిలా మాటలు నేర్చుకున్నాడు. దీంతో ఆయన సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. తెలుగు సినిమా పాటలతో పాటు జానపద పాటలు పాడుతే ఫేమస్ అయ్యాడు. యూట్యూబ్ షార్ట్స్ లో తన వీడియోలను పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
Tags:    

Similar News