శర్వాతో లైవ్ లో ఆడుకున్న కమెడియన్

Update: 2017-01-17 04:27 GMT

సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్యలో వచ్చినా.. శర్వానంద్ నటించిన శతమానం భవతి సూపర్ గా ఆడేస్తోంది. ప్రమోషన్స్ విషయంలో కూడా యూనిట్ ఎక్కడా తగ్గడం లేదు. రీసెంట్ గా హీరో శర్వానంద్.. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ లు ఓ ఛానల్ కు వెళ్లి.. ఆడియన్స్ తో లైవ్ లో మాట్లాడారు కూడా. ఆ లైవ్ ప్రోగ్రాంకి.. ఓ కమెడియన్ ప్రాంక్ కాల్ చేసి.. శర్వానంద్ ని ఆట పట్టించాడు.

'నా పేరు వర్మ రాజు.. మాది భీమవరం' అంటూ మొదలుపెట్టిన ఆ కాలర్ ఎవరో కాదు.. టాప్ కమెడియన్ రేసులో దూసుకుపోతోన్న ప్రవీణ్. 'సంక్రాంతికి చిరంజీవి-బాలయ్యల సినిమాల తర్వాత మీ సినిమాని రిలీజ్ చేసిన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. గతేడాది కూడా నాన్నకు ప్రేమతో.. డిక్టేటర్.. సోగ్గాడే చిన్ని నాయన మూవీస్ ఉన్నా.. వాటి మధ్యలో వచ్చి హిట్ కొట్టారు. ఈ సారి కూడా అదే రేంజ్ హిట్ సాధించి.. సంక్రాంతి హీరో అయిపోయారు' అంటూ పొగిడేశాడు ప్రవీణ్. అయితే.. ఈ గొంతు ఎక్కడో విన్నట్లుగా ఉందే అన్న శర్వానంద్.. ప్రవీణ్ ని గుర్తు పట్టలేకపోయాడు.

కానీ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మాత్రం.. 'అన్నయ్యా' అంటూ టక్కున గుర్తు పట్టేసి పలకరించేసింది. 'సెట్స్ లోను మిమిక్రీ చేసి.. ఇక్కడా మిమిక్రీ చేసి మమ్మల్ని ఆట పట్టిస్తే ఎలా ప్రవీణ్' అంటూ నవ్వేశాడు శర్వా. ప్రాంక్ కాల్ అయినా.. ఆడియన్స్ ను మాత్రం ఈ ఎపిసోడ్ బాగా అలరించింది. 
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News