ఇవాళ ఉదయం నుంచి టాలీవుడ్లో కమెడియన్ పృథ్వీ రాజ్ పేరు మార్మోగిపోతోంది. భార్యతో వివాదానికి సంబంధించిన కేసును విచారించిన విజయవాడ కోర్టు.. పృథ్వీ తన భార్యకు నెలకు రూ.8 లక్షల చొప్పున భరణంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంపై తీవ్ర చర్చనీయాంశమవుతోంది. భార్యతో పృథ్వీకి ఆ స్థాయిలో వివాదాలున్నాయని.. కేసు ఇంత దాకా వెళ్లిందని ఇండస్ట్రీ జనాలకు తెలియదు. దీంతో పృథ్వీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఐతే ఇలాంటి సమయంలో పృథ్వీకి తన కొడుకు నుంచి సపోర్ట్ లభించడం విశేషం. తన తండ్రి గురించి పృథ్వీ తనయుడు సాయి శ్రీనివాస్ పాజటివ్ గా మాట్లాడాడు.
తమ కుటుంబ గొడవలు కోర్టు వరకు వెళ్తాయని తాను ఊహించలేదని అన్నాడు సాయి శ్రీనివాస్. తన తల్లి వెనుక ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని అతను ఆరోపించాడు. తనను.. తన చెల్లెలిని తమ తండ్రి చాలా బాగా చూసుకుంటారని.. ఆయన ఎలాంటి వారన్నది ఇండస్ట్రీ జనాలందరికీ తెలుసని సాయిశ్రీనివాస్ అన్నాడు. ఈ వివాదాన్ని కోర్టులోనే పరిష్కరించుకుంటామని అతనన్నాడు. విజయవాడలో శ్రీలక్ష్మి అనే అమ్మాయిని పెళ్లాడిన పృథ్వీ.. తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే క్రమంలో కుటుంబాన్ని హైదరబాద్ తరలించాడు. ఐతే తర్వాత భార్యతో విభేదాలొచ్చి ఆమెను ఇంటి నుంచి పంపేశాడని అంటున్నారు. ఇద్దరి మధ్య రాజీ చేయడానికి పెద్ద మనుషుల పంచాయితీ విఫలమవడంతో శ్రీలక్ష్మి పృథ్వీపై 498-ఎ కేసు పెట్టింది. భరణం కోసం కోర్టును ఆశ్రయించగా.. ఆమెకు నెలకు రూ.8 లక్షల చొప్పున చెల్లించమంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/