ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్ యశోదా హాస్పటల్ లో చేరారు. కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వైద్యులు తెలిపారు.
తెలుగు చిత్రసీమలో కమెడియన్ గా తనదైన ముద్రను వేసిన వేణుమాధవ్.. అలీ-ధర్మవరపు సుబ్రమణ్యం- ఎం.ఎస్.నారాయణ-ఏవీఎస్ వంటి ప్రముఖ కమెడియన్లతో సమకాలికుడిగా పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. మనకు ఉన్న గొప్ప కమెడియన్లలో వేణుమాధవ్ ఒకరిగా పాపులరయ్యారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారన్న ప్రచారం ఉంది. కొన్నిసార్లు మీడియాలో అదుపుతప్పిన ప్రచారంపైనా ఆయన సీరియస్ అయిన సందర్భాలున్నాయి.
అయితే తాజాగా మీడియా అధికారిక గ్రూప్ లు `వేణుమాధవ్ కు తీవ్ర అనారోగ్యం` అంటూ వెల్లడించడంతో సమస్య సీరియస్ అని అర్థమవుతోంది. అయితే వేణుమాధవ్ చికిత్స పొంది కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
కెరీర్ పరంగా పరిశీలిస్తే.. 1996లో సంప్రదాయం అనే చిత్రంతో వేణుమాధవ్ నటుడిగా కెరీర్ ప్రారంభించారు. పరిశ్రమ అగ్ర దర్శకుల సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించారు. 2015లో రేయ్ .. రుద్రమదేవి చిత్రాల్లో నటించారు. రుద్రమదేవిలో టిట్టిబి అనే పాత్రతో ఆకట్టుకున్నారు. 2016లో డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ అనే చిత్రంలోనూ నటించారు. ఇటీవల నటన పరంగా తెరకు దూరంగా ఉంటున్నారు.