అల్లు అర్జున్ నటించిన చిత్రం `పుష్ప ది రైజ్`. సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు. బన్నీ పుష్పరాజ్ గా ఊర మాస్ పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధిస్తోంది.
బన్నీ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఆనందంలో మునిగితేలుతున్నారు. బన్నీతో చేసిన మూడవ సినిమా హ్యాట్రిక్ హిట్ గా నిలవడమే కాకుండా గత చిత్రాలకు మించి పాన్ ఇండియా స్థాయిలో పేరుతో పాటు బాక్సాఫీస్ వద్ద వసూళ్లని రాబడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో థ్యాంక్స్ మీట్ ని ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ హీరో బన్నీపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ సందర్భంగా చంద్రబోస్ ని సిరివెన్నెల సీతారామశాస్త్రితో పోల్చిన సుకుమార్ ఆ తరువాత రష్మిక మందన్న పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం తనకిష్టమైన హీరో అల్లు అర్జున్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి పలువురిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేశారు.
బన్నీ డార్లింగ్ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వంద సార్లు చెబుతున్ననా నీకు. అంతా ఓ తెప్పమీద ఇలా చూస్తూ కూర్చుంటే నేను మునిగిపోతున్నాను. అదే సమయంలో ఒకే ఉదుటున బన్నీ దూకి నన్ను నీటిలోంచి బయటికి లాగాడు. నేను ఆ సమయంలో అతన్ని కిందకి లాగేస్తున్నా..ఇద్దరం మునిగిపోతున్నాం. ఆ సమయంలో మా ఇద్దరిని ఇంకో ముగ్గురొచ్చి కాపాడారు. అప్పుడే అనుకున్నాను. `యు ఆర్ మై గాడ్` అని. ఆ విషయంలో మీము మాట్లాడుకుని వుండకపోవచ్చు కానీ పైకి జోవియల్ గా సరదాగా మాట్లాడే బన్నీలో ఓ గ్రేట్ ఫిలాసఫర్ వున్నాడు.
అది చెబితే మీరు నమ్మరు. `ఆర్య` అప్పుడు నేను ఏం చెబితే అది విన్నాడు కానీ `పుష్ప` మాత్రం తనేం చెబితే అది నేను విన్నాను. అని షాకిచ్చారు సుకుమార్. బన్నీ వెరీ కాంప్లెక్స్ ఆర్టిస్ట్ . లేయర్స్ లేయర్స్ మిక్స్ చేసి ఒక సీన్ ని మనం ఎలా అయితే అల్లుకుంటామో తన పెర్ఫార్మెన్స్ ని బన్నీ తన ఫేస్ మీద అలా అల్లుకుంటాడు. ఈజ్ ఏ వీవర్ ఆఫ్ ద ఎక్స్‌ప్రెషన్స్.. లవ్ యూ డార్లింగ్ ` అంటూ బన్నీని సుకుమార్ ఆకాశానికి ఎత్తేశారు.