టబును తీసుకుంటే పోయేదిగా!

Update: 2021-09-18 06:32 GMT
టబూ తెలుగు వారికి బాగా అల‌వాటైన న‌టి. కెరీర్ ప్రారంభించిందే తెలుగు సినిమాల‌తో. హైద‌రాబాదీ, బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంధాదూన్ సినిమాతో ట‌బు న‌టిగా మ‌రో మెట్టు ఎక్కింది. వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డం త‌న‌కు కొట్టిన పిండి అని చాటుకుంది. వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌ల్లో అల‌రిస్తాన‌నే హామీని ఇచ్చింది త‌న అభిమానుల‌కు. ఒక‌వైపు హోమ్లీ పాత్ర‌ల‌ను చేయ‌డానికి అయినా, మ‌రోవైపు బోల్డ్ పాత్ర‌ల‌ను చేయ‌డానికి అయినా ఈ వ‌య‌సులో ట‌బూ రెడీగా ఉంటోంది. మ‌రి అంధాదూన్ తెలుగు రీమేక్ లో కూడా ట‌బూ న‌టించి ఉంటే బాగుండేద‌నేది ఇప్పుడు వినిపిస్తున్న మాట‌!

తెలుగు ఆంధాదూన్ ను చూసిన వారు త‌మ‌న్నా ఆ పాత్రను చేసిన తీరుపై పెద‌వి విరుస్తున్నారు. ప్ర‌త్యేకించి హిందీ వెర్ష‌న్ ను చూసి, తెలుగు వెర్ష‌న్ ను చూసిన వారు... త‌మ‌న్నా ఈ పాత్ర‌కు సూట్ కాలేదేమో అంటున్నారు. త‌మ‌న్నా ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బ‌తీసింద‌ని, గ్లామ‌ర్ డోసును అందిస్తూ.. సినిమాకే ఆడ్ గా మారింద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. త‌ను గ్లామ‌ర‌స్ గా ఉన్న‌ట్టుగా నిరూపించుకోవ‌డం త‌మ‌న్నాకు అవ‌స‌రం. ఆమె ఇంకా అలాంటి పాత్ర‌లు చేసే ప‌రిస్థితుల్లోనే ఉంది. అలాంటామెను ఇలాంటి పాత్ర‌కు తీసుకోవ‌డం త‌ప్ప‌య్యింద‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు.

ఎలాగూ ట‌బూ ఈ మ‌ధ్య కూడా తెలుగు సినిమాలు చేసింది. ఆమె అంధాదూన్ రీమేక్ లో న‌టించ‌డానికి పెద్ద‌గా అభ్యంత‌రం చెప్పేది కాదేమో. అయితే ఎందుకో తెలుగు ద‌ర్శ‌కుడి చూపు మ‌రొక‌రి మీద ప‌డింది. వాస్త‌వానికి ఈ పాత్ర‌లో న‌య‌న‌తార‌ను తీసుకోవాల‌ని కూడా అనుకున్నార‌ట‌. ఆమెను సంప్ర‌దించార‌ట కూడా. అయితే.. ఎందుకో న‌య‌న‌తార ఈ పాత్ర‌కు ఒప్పుకోన‌ట్టుగా ఉంది. దీంతో త‌మ‌న్నా తెర‌పైకి వ‌చ్చింది. అయినా త‌మ‌న్నా బ‌దులు.. ట‌బూనే అయిఉంటే బాగుంటేద‌నేది ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న మాట‌.
Tags:    

Similar News