బిగ్ బాస్ సీజన్ 2 మీద విమర్శల జోరు అంతకంతకూ ఎక్కువయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎలిమినేషన్ రౌండ్ లో తాజాగా ఎలిమినేట్ అయిన హౌస్ మేట్ ఎంపిక వేలెత్తి చూపించేలా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటరైన ఫైర్ బ్రాండ్ మోడల్ సంజనా గత వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఈ వారం సైతం మరో కామన్ మ్యాన్ హౌస్ నుంచి బయటకు రావటంపై పలువురు తప్పు పడుతున్నారు.
తమ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందన్న విషయాన్ని గ్రహించారేమో కానీ.. ప్రయోక్త నాని చేత కవరింగ్ మాటల్ని చెప్పినట్లుగా కనిపించింది. ఇంతకీ.. ఈ వారం ఎలిమినేట్ అయిన సామాన్యుడు మరెవరో కాదు.. తన మాటలతో.. చేతలతో అలరించిన నూతన్ నాయుడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి ప్రవేశించిన హీరోయిన నందిని రాయ్ కోసమే తనను తప్పించినట్లుగా సంజనా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరోపించటం మర్చిపోకూడదు.
సంజనాకు భిన్నంగా నూతన్ నాయుడు తన ఎలిమినేషన్ మీద సీరియస్ కాలేదు. అదే సమయంలో.. ఒక పిట్టకథతో నూతన్ నాయుడు ఎలిమినేషన్ ప్రక్రియ తప్పు కాదన్నట్లుగా నాని వివరణ ఇవ్వటం గమనార్హం. నూతన్ నాయుడు ఎలిమినేషన్ బిగ్ బాస్ మీద నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉందని భావించారో.. వరుసగా మరో సామాన్యుడు హౌస్ నుంచి నిష్క్రమించటం నెగిటివ్ అవుతుందని అనుకున్నారో కానీ.. నాయుడు ఎందుకు ఎలిమినేట్ అయ్యారన్న విషయాన్ని మరోమారు వివరించే పనిని పెట్టుకున్నారు నాని.
ఒక్క ఘటనతో కౌశల్ ఎమోషన్ తో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని.. దాంతో ఓట్లన్నీ అతనికి వెళ్లటంతో నూతన నాయుడు ఎలిమినేట్ కాక తప్పలేదన్నారు. బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటూ వివరణ ఇచ్చిన నాని.. దీప్తి సునైనాను కౌశల్ ఎత్తుకోవటం ఏంటి? కంటెస్టెంట్ లంతా అతన్ని తప్పు పట్టటం ఏమిటి? కిరిటీ రచ్చ చేయటం ఏంటి? ప‌్రేక్షకులు కనెక్ట్ అయి ఓట్లు వేయటం ఏంటి? ఇదంతా ఓ బటర్ ఫ్లై ఎఫెక్ట్ కాకుంటే అంటూ పిట్టకథను చెప్పిన నాని నూతన నాయుడి ఎలిమినేషన్ లో ఎలాంటి పొరపాట్లు దొర్లలేదన్న విషయాన్ని చెప్పటం గమనార్హం. మొత్తానికి వరుస వారాల్లో వరుసగా సామాన్యులు హౌస్ నుంచి బయటకు రావటం బిగ్ బాస్ తీర్పుపై అనుమానాల్ని కలిగించేలా చేసిందన్న మాట మాత్రం బలంగా వినిపిస్తోంది. మరి.. ఈ మరకను తుడుచుకునే ప్రయత్నం జరుగుతుందో లేదో చూడాలి.