స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన 'యశోద' సినిమా నిన్న శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఏ విధంగా ప్రభావం చూపిస్తోందనేది పక్కన పెడితే.. ఇది ఓ హాలీవుడ్ సినిమాకు స్ఫూర్తి అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సరోగసీ నేపథ్యంలో సాగే మెడికల్ మాఫియా కథను 'యశోద' సినిమాలో చూపించే ప్రయత్నం చేసారు. అయితే ఇది 2018లో వచ్చిన 'లెవల్ 16' అనే ఇంగ్లీష్ మూవీని స్ఫూర్తిగా తీసుకొని తీసారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడి సెటప్ వేరేగా ఉన్నప్పటికీ.. ఓవరాల్ ఫ్లాట్ చూసుకుంటే ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకునే కథ రాసుకున్నారేమో అనిపిస్తుందని అంటున్నారు.
'లెవల్ 16' అనేది 2018 లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీ. అందమైన అమ్మాయిల చర్మాలను తీసి.. డబ్బున్న వారికి అమ్మేసి, వాళ్ళ శరీరాలకు ఈ చర్మాలను అతికించే గ్యాంగ్ కథ ఇది. డబ్బు కోసం అందులోకి ప్రవేశించిన ఇద్దరు అమ్మాయిలు.. ఆ నిజాన్ని ఎలా భయపెట్టారు? అందులో నుంచి బయటపడేందుకు ఎలాంటి పోరాటం చేసారు? అనేది చూపించారు.
'యశోద' విషయానికొస్తే.. ఇక్కడ కూడా బయట ప్రపంచంతో సంబంధం లేని ఒక హాస్పిటల్.. సరోగసి పేరుతో జరిగే నేరం చుట్టూ కథ నడుస్తుంది. ఆర్థిక అవసరాల రీత్యా అద్దె గర్భం ఇవ్వడానికి రెడీ అయిన అమ్మాయిలు.. అక్కడ యశోద చేసిన పోరాటం వంటివి చూపించారు. అందుకే ఇప్పుడు ఈ చిత్రానికి ఇంగ్లీష్ మూవీతో పోలికలు పెడుతున్నారని తెలుస్తోంది.
అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే.. 'లెవల్ 16' కథాంశం మరియు ఫ్లాట్ అంతా 2005 లో వచ్చిన 'ది ఐలాండ్'.. అలానే 'నెవర్ లెట్ మీ గో' అనే నవలకి చాలా పోలికలు కనిపిస్తాయి. ఇప్పుడు దర్శక ద్వయం హరి & హరీష్ లు కూడా వాటి నుంచి స్ఫూర్తి పొంది ఈ స్టోరీ రాసుకున్నారా లేదా అనేది తెలియదు కానీ.. ఓ భిన్నమైన పాయింట్ ని తీసుకొని సినిమాగా చూపించారు.
దర్శకులు ఓ కొత్త ఊహాజనితమైన కథని రాసుకున్నారు కానీ.. కథని నడిపించిన విధానంలోనే లోపాలు కనిపిస్తాయి. ఊహకు తగ్గట్టుగా సాగే సన్నివేశాలు మరియు సీన్స్ లో థ్రిల్ కొరవడటం.. ప్లాట్ పాయింట్ ని కన్విన్సింగ్ గా తెరపై ఆవిష్కరించకపోవడం 'యశోద' సినిమాలో బలహీనతలుగా పేర్కొనవచచ్చు. అయితే సమంత వరకూ ఈ సినిమాని తన భుజాల మీద మోసిందని చెప్పాలి. తన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ని సమర్ధవంతంగా చూపించడమే కాదు.. యాక్షన్ సీన్స్ లోనూ అద్భుతంగా పెరఫార్మ్ చేసింది.
'యశోద' టాక్ ఎలా ఉన్నా.. ఈ వీక్ లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవకడం కాస్త కలిసొచ్చే అంశమని చెప్పాలి. నిన్న మార్కింగ్ షోలతో పోల్చుకుంటే.. ఈవెనింగ్ షోల సమయానికి ఆక్యుపెన్సీ బాగానే ఉందని అంటున్నారు. ఈ వారాంతంలో రాబట్టే వసూళ్లను బట్టే మూవీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. 'ఓ బేబీ' 'యూ టర్న్' వంటి మహిళా ప్రాధాన్యత చిత్రాలతో సక్సెస్ అందుకున్న సమంత.. ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనేది ఈ వీకెండ్ లో తేలిపోతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.