షారుక్ ఖాన్ తో వివాదం..గుట్టు విప్పేసిన అజ‌య్ దేవ‌ణ్!

Update: 2022-05-13 00:30 GMT
బాలీవుడ్ లో షారుక్ ఖాన్-అజ‌య్ దేవ‌గ‌ణ్ మ‌ధ్య విబేధాలున్న‌ట్లు త‌రుచూ మీడియాలో క‌థ‌నాలు వైర‌ల్ అవుతూనే  ఉంటాయి. ఇద్ద‌రి మ‌ధ్య ఈగో క్లాషెస్ స‌హా సినిమా రిలీజ్ విష‌యంలోనూ విబేధాలు త‌లెత్తిన‌ట్లు....కాజోల్ అగ‌ర్వాల్ కార‌ణంగానూ  ఇద్ద‌రి స్టార్ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే స్థాయిలో వివాదం ఉన్న‌ట్లు మీడియా క‌థ‌నాలు హీటెక్కిస్తుంటాయి.

అయితే వీటిపై ఏనాడు ఇద్ద‌రు హీరోలు ప‌బ్లిక్ గా స్పందించింది లేదు. మీడియా క‌థ‌నాల‌కి సైతం పుల్ స్టాప్  పెట్టే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. బాలీవుడ్ వ‌ర్గాలు  నుంచి సైతం వీటిని ఖండించే ప్ర‌య‌త్నం ఏనాడు క‌నిపించ‌లేదు.  దీంతో ఈ క‌థ‌నాలు నిజ‌మే అన్నంత‌గా ప్రాచుర్యంలోకి వ‌చ్చాయి. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అజ‌య్ దేవ‌గ‌ణ్ కొన్నేళ్ల పాటు కొన‌సాగుతున్న ఈ క‌థ‌నాల‌న్నింటికి పుల్ స్టాప్ పెట్టేసారు.

''నాకు షారుక్ ఖాన్ కి మ‌ధ్య ఎలాంటి విబేధాలు లేవు. షారుక్..స‌ల్మాన్...అమీర్ అంతా ఒకేసారి ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చాం. మేమంతా ఒకే జ‌న‌రేష‌న్ న‌టులం. మా అంద‌రి మ‌ధ్య ఎప్పుడూ సినిమా పోటీ ఉంటుంది. అదీ ఎంతో ఆరోగ్య‌క‌రంగా ఉంటుంది. అంత‌కు మించి వ్య‌క్తిగ‌త విబేధాలు ఏమీ లేవు. షార‌క్ కు -నాకు మ‌ధ్య విబేధాలున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

వాటి గురించి మాట్లాడ‌టం అంత అవ‌స‌రం లేద‌ని ఇన్నాళ్లు ప‌ట్టించుకోలేదు. కానీ వాటిని ఖండించ‌క‌పోతే ప్ర‌జ‌లు  నిజ‌మే అనుకుంటారు. అందుకే ఇలాంటి వివ‌ర‌ణ ఇస్తున్నాను' అని తెలిపారు. దీంతో ఎన్నో ఏళ్ల పాటు సాగుతోన్న అన్నిర‌కాల క‌థ‌నాల‌కి అజ‌య్ వివ‌ర‌ణ తో శాశ్వ‌త ప‌రిష్కారం దొరికిన‌ట్లే. ఇలా  ఆ ఇద్ద‌రి మ‌ధ్య వార్ వివాదం చిక్కుముడి వీడింది. అయితే మ‌రో వివాదం కూడా చాలా కాలంగా వినిపిస్తుంది.

అదే షారుక్ ఖాన్-అమీర్ ఖాన్ మ‌ధ్య కూడా గొడ‌వ‌లున్నాయ‌ని మీడియాలో త‌రుచూ క‌థ‌నాలు వెలువ‌డుతుంటాయి. వాటిపై ఏనాడు ఆ ఇద్ద‌రు కూడా స్పందించ‌లేదు. వాళ్ల మ‌ధ్య వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు స‌ల్మాన్ ఖాన్ ఓసారి మ‌ధ్య వ‌ర్తిత్వం చేసార‌ని కూడా బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

కానీ ఆ మీడియాటింగ్ ఫెయిలైంద‌ని..ఆ కార‌ణంగా వివాదం మ‌రింత ముదిరిన‌ట్లు క‌థ‌నాలు వెలువ‌డుతుంటాయి. నిజంగా వివాదాలు ఉన్నా ప‌బ్లిక్ గా  ఒకర్ని ఒక‌రు దూషించుకుంది లేదు. ఎన్ని మ‌న‌స్ప‌ర్ధ‌లున్నా లోలోప‌లే దాగి ఉంటాయి. అవి బ‌య‌ట‌కు వ‌చ్చిన రోజున భూగోళం బ‌ద్ద‌లైన‌ట్లే ఉంటుంది.
Tags:    

Similar News