త్రివిక్రమ్‌ .. ఆ సీన్‌ కాపీయేనా?

Update: 2015-04-10 06:22 GMT
బన్ని హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో 'సన్నాఫ్‌ సత్యమూర్తి' నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. బన్ని ఈ చిత్రంలో క్లాస్‌ హీరోగా కనిపించాడు. ఓ రొమాంటిక్‌ ఎమోషనల్‌ సెంటిమెంట్‌ ఫ్యామిలీ స్టోరీ ఇది. ఇందులో ఓ సన్నివేశం గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ముచ్చటించుకుంటున్నారు.

తండ్రిని యాక్సిడెంట్‌లో కోల్పోయి, 300కోట్లు అప్పులోళ్లకు రాసిచ్చేసి, అటుపై ఖరీదైన బంగ్లా అన్నీ వదులుకుని ఓ అద్దె ఇంట్లోకి దిగాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది బన్ని కుటుంబానికి. అద్దె ఇంట్లోకి వెళ్లాక అన్న-వదినల చిన్నారి కూతురు.. ఈ ఫ్లాట్‌ ఏం బాలేదు! అని అంటుంది. అయితే ఇదంతా ఓ రియాలిటీ షో. ఇందులో నువ్వు బాగా నటిస్తే బోలెడన్ని చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు ఇస్తారు.. అని చిన్నారిని నమ్మిస్తాడు.డఖరీదైన విల్లాలో ఉన్నప్పటికి, మధ్యతరగతి ఫ్లాట్‌లో ఉండాలంటే చాలా కష్టమే. ఆ విషయాన్ని ఆ సన్నివేశంలో చెప్పాలన్నది దర్శకుడి పాయింట్‌ ఆఫ్‌ వ్యూ.

అయితే ఇలాంటి సేమ్‌ సన్నివేశం బాలీవుడ్‌ సినిమా 'తారా రమ్‌ పమ్‌'లో ఉంది. అక్కడ సైఫ్‌ అలీఖాన్‌కి ఇలాంటి పరిస్థితే వస్తుంది. రాణీముఖర్జీ భర్త సైఫ్‌  ఫార్ములా-1 రేసర్‌. ఉన్నవన్నీ కోల్పోతాడు. ఓ మధ్యతరగతి ఫ్లాట్‌లోకి వచ్చేస్తాడు. కూతురికి సర్ధి చెప్పాల్సొస్తే .. ఇదంతా ఓ రియాలిటీ షో. ఇందులో మనమంతా పాత్రధారులం అని చెప్పి కవర్‌ చేసేస్తాడు. ఈ రెండు సన్నివేశాల మధ్య అంతటి క్లోజ్‌నెస్‌ ఉంది. అయితే ఇది యాక్సిడెంటల్‌గా జరిగిందా, త్రివిక్రమ్‌కు కూడా సేమ్‌ థాట్‌ వచ్చిందా, లేకపోతే మనోడు కావాలనే వాడుకున్నాడా?
Tags:    

Similar News