దేవిశ్రీ.. నిజంగానే మ్యూజిక్ లేపేశాడా??

Update: 2016-12-12 14:12 GMT
ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద దుమారం రేపడం మీరు చూసే ఉంటారు. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఖైదీ నెం 150 సినిమాకు అందించిన టీజర్ కోసం.. బాలీవుడ్ హిట్ సుల్తాన్ సినిమా మ్యూజిక్ కాపీ కొట్టేశాడని అంటూ.. ఒక కంపారిజన వీడియోను షేర్ చేస్తున్నారు జనాలు. ఇంతకీ ఏంటా కహానీ.. చూద్దాం పదండి.

అచ్చం ఖైదీ నెం. 150 కోసం దేవి కొట్టిన మ్యూజిక్.. సుల్తాన్ సినిమా ఫ్యాష్ బ్యాక్ లో సల్మాన్ ఖాన్ ఒక పెద్ద మైదానంలోకి అడుగుపెట్టే సీన్లో కూడా వినిపిస్తోంది అనేది వీరి వాదన. అక్కడ కంపారిజన్ లో రెండు వీడియోలనూ వింటుంటే మాత్రం.. ఆ మ్యూజిక్ నిజంగా ఒకేలా ఉంది. అయితే చిరంజీవి స్టాలిన్ సినిమాలో కూడా ఇలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ ఉందండోయ్. మరి ఒక టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరక్టర్ ఇలా బ్యాగ్రౌండ్ స్కోర్ కాపీ చేశాడంటే మాత్రం.. కాస్త వింతగానే ఉంటుంది. నిజంగానే లేపేశాడంటారా?

ఒక ప్రక్కన ఎంతో స్టార్డమ్ ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఒక సింపుల్ బ్యాగ్రౌండ్ స్కోర్.. అది కూడానూ ఎంతో ఐకానిక్ అయిన ఖైదీ నెం 150 సినిమా కోసం కాపీ చేస్తాడా? చేయడనే సినిమా లోకం అంతా అనుకుంటున్నారు. మరి ఒకేలా వినిపిస్తున్న సౌండు ఏంటంటారూ?? వెయిట్ అండ్ సి.

Full View
Tags:    

Similar News