కరోనా ఎఫెక్ట్ మామూలుగా లేదు. చికిత్సతో కోలుకున్న రోగులు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ అంటూ కొత్త రోగాలతో అల్లాడుతున్నారు. ఇక కరోనా ప్రభావం అన్ని ఇండస్ట్రీస్ మీదా ఘోరంగా పడింది. ఇప్పుడు దీని ప్రభావం తో పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎఫెక్ట్ అవుతున్నారు. వారి నడుమ కలతలు గొడవలు మొదలయ్యాయట.
ఓవైపు కరోనా వెంటాడుతుంటే ఆదరాబాదరాగా షూటింగులు చేస్తున్న సన్నివేశం ఉంది. కారణం ఏదైనా ఫైనల్ ఔట్ పుట్ చూశాక ఖంగు తింటున్న నిర్మాతలు ఈ విజువల్స్ ఏంటి? వెంటనే రీషూట్ చేయండి అని ఆర్డర్స్ వేస్తున్నారట. తీరిగ్గా లాక్ డౌన్ సమయంలో విజువల్స్ ని వెరిఫై చేస్తే లోటుపాట్లు తెలిసొస్తున్నాయి. దీంతో రీషూట్లు అంటూ తిరిగి దర్శకుడిని టెన్షన్ పెట్టేస్తున్నారు నిర్మాతలు.
ఆల్రెడీ పూర్తయిన సినిమాని రీషూట్ చేస్తే ఇంకా ఆలస్యమవుతుంది. ఇప్పుడున్న కష్టకాలంలో సరిపెట్టుకోండి! అనేందుకు లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమవుతోంది. కానీ రీషూట్లు చేయాల్సిందేనని నిర్మాతలు పట్టుబడుతున్నారట. సుదీర్ఘ నిర్మాణ షెడ్యూల్ దర్శకనిర్మాతల సృజనాత్మక ప్రక్రియను ప్రభావితం చేస్తోంది.
దర్శకులు ఈ సన్నివేశంలో తీవ్ర ఒత్తిడితో గందరగోళంలో ఉన్నారు. పూర్తయిన షూటింగ్ పార్ట్ చూసిన తరువాత ఓ ఇద్దరు టాలీవుడ్ యువ హీరోలు తమ సినిమాల రీషూట్ కోసం ఇప్పటికే పిలుపునిచ్చారని తెలిసింది. ఇప్పుడు సీనియర్ నిర్మాత నుండి వచ్చిన రీషూట్ ఆర్డర్ ద్వారా మరో యువ హీరో ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చాలా చురుకుగా పాల్గొనే ఈ యువ హీరో ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది. ఎడిటింగ్ టేబుల్ వద్ద సినిమా చూసిన తరువాత సీనియర్ నిర్మాత కోపంతో ఊగిపోతూ దర్శకుడిని తిట్టాడని కొన్ని భాగాలను రీరైట్ చేసి రీషూట్ చేయాలని ఆదేశించాడని తెలిసింది.
ఈ గందరగోళంతో ప్రొడక్షన్ ఆలస్యం అవుతుందని దర్శకుడు ఆరోపించారు. ఒకవేళ రీరైట్ చేసి రీషూట్లు చేయాల్సి వస్తే ఈ మూవీ ఈ ఏడాది రానేరాదు. వచ్చే ఏడాదికే అది సాధ్యమవుతుందనేది అతడి ఆందోళన. కానీ తప్పదు.. నిర్మాత కోసం చేయాల్సిందే మరి.