టాలీవుడ్ లో కొందరు స్టార్లకే కాదు దర్శకులకు అమెరికా మార్కెట్ పెద్ద ఊరట. తెలుగు కుటుంబాల సెంటిమెంట్స్.. సెన్సిబిలిటీస్ ఎన్నారైలకు పిచ్చిగా ఎక్కేస్తాయి. అందుకే అలాంటి కంటెంట్ వండి వార్చే డైరెక్టర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎన్నారై బ్యాక్ డ్రాప్ కి తెలుగు నేటివిటీని ముడివేసి తెలివిగా గ్రిప్పింగ్ గా సినిమాలు తీస్తే అమెరికాలో బంపర్ హిట్లు సాధ్యమవుతున్నాయి. అక్కడ 3.5 మిలియన్ డాలర్ వసూళ్లు కొల్లగొట్టిన సందర్భాలున్నాయి.
ఇక ఎన్నారై డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ దర్శకుడికి అమెరికా వసూళ్లు సునాయాసంగా దక్కుతాయి. ఇప్పటివరకూ `హ్యాపీడేస్` మొదలు `ఫిదా` వరకూ కమ్ముల తెరకెక్కించిన ప్రతి సినిమాకి విదేశీ ఆదాయం గొప్పగానే దక్కింది. కమ్ముల అమెరికా మార్కెట్లో ఒక పెద్ద స్టార్డమ్ ఉన్న దర్శకుడు. అతని బ్రాండ్ అక్కడ టాలీవుడ్ టాప్ స్టార్స్ కంటే పెద్దది. ఇంతకుముందు `ఫిదా` కేవలం అమెరికాలో 2 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. కమ్ముల మునుపటి చిత్రాలన్నీ విదేశీ మార్కెట్లో బ్లాక్ బస్టర్స్. అయితే ఈసారి ఆ పప్పులుడుకుతాయా? అంటే సందేమమేనన్న టాక్ ట్రేడ్ లో వినిపిస్తోంది.
నాగచైతన్య- సాయిపల్లవి జంటగా కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రేంజులో రిలీజ్ కి ఆస్కారం ఉన్నా అమెరికాలో ఆ అవకాశం కనిపించడం లేదు. అక్కడ కొనసాగుతున్న మహమ్మారీ ప్రభావంతో థియేటర్లను సరిగా తెరవకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. దాని ప్రభావం `లవ్ స్టోరి` విదేశీ బిజినెస్ పైనా పడుతోందట. ఇక ఇటీవల రిలీజైన తెలుగు సినిమాలేవీ అమెరికాలో పెద్దగా వసూళ్లను తేలేదు. అక్కడ ట్రేడ్ మందకొడిగా సాగుతోంది. దీంతో లవ్ స్టోరి ని మార్కెట్ చేయడం ఎలా అన్నది ఇబ్బందికరంగా మారిందట.
ఇటీవలే `సారంగ దరియా..` సాంగ్ తో ఒక్కసారిగా లవ్ స్టోరీకి ఉపొచ్చింది. దీనిపై ఎన్నారైల్లోనూ ఉత్కంఠ పెరిగింది. కానీ దానిని అమెరికాలో క్యాష్ చేయాలంటే ముందుగా క్రైసిస్ తొలగి థియేటర్లన్నీ తెరవాలి. రిలీజ్ లకు ఆస్కారం కల్పించాలి. ఈ రొమాంటిక్ డ్రామా వచ్చే నెలలో విడుదలవుతోంది కాబట్టి అప్పటికి పరిస్థితులు మెరుగవుతాయనే ఆశిస్తున్నారు. ఇక అమెరికాలో తన సినిమా ఆడకపోతే నిర్మాణ భాగస్వామిగా ఉన్నందున కమ్ములకు పెద్ద ఎత్తున ఆదాయం పడిపోతుందని ఓ అంచనా. చిన్న పారితోషికం అందుకుని విదేశీ మార్కెట్ నుంచి లాభాల్ని ఆయన ఆశిస్తారు. అందువల్ల ఇప్పుడున్న క్రైసిస్ లో అతడికి కలిసి వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. అమెరికాలో పెద్ద ఎత్తున బిజినెస్ సాగి వసూళ్లు తెస్తే ఆ మేరకు తన ఖాతాలో పెద్ద లాభం పడుతుంది. కుదరని పక్షంలో ఆ నష్టం తనే భరించాల్సి ఉంటుందిట. ఇదే ప్రస్తుతం కమ్ములలో టెన్షన్ పెంచుతోందట. తెలుగు రాష్ట్రాల్లో 40కోట్ల మేర బిజినెస్ సాగిందని ప్రచారమవుతున్నా విదేశీ బిజినెస్ గురించే సరైన వివరాలు రాలేదు. ఏషియన్ నారంగ్ దాస్ తో కలిసి శేఖర్ కమ్ములకు చెందిన అమిగోస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.