ఆ సినిమాల ఎఫెక్ట్ శ్రీకారంపై పడిందే

Update: 2020-03-26 01:30 GMT
ప్రస్తుతం థియేటర్లు అన్నీ మూసి ఉన్నారు కానీ మరో నెల రోజులు.. లేదా రెండు నెలల్లో థియేటర్లు తెరిచే అవకాశం ఉంటుంది. సినిమా హాల్స్ ఒక్కసారి ఓపెన్ అయితే ఇప్పుడు రిలీజ్ కాకుండా వాయిదా పడిన సినిమాలు ఒక్కొక్కటి వరసగా విడుదల అవుతాయి. ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం అయితే శర్వానంద్ 'శ్రీకారం' ఏప్రిల్ 24 న రిలీజ్ కావాలి. అయితే ఇప్పుడు ఆ డేట్ కు 'శ్రీకారం' రావడం దాదాపు కష్టమే. 'శ్రీకారం' మేకర్స్ కొత్త డేట్ చూసుకోక తప్పదు.

ఇదిలా ఉంటే ఈ సినిమాపై ట్రేడ్ లో పెద్దగా నమ్మకాలు లేవని టాక్ వినిపిస్తోంది. శర్వా నటించిన సినిమాలు వరసగా ఫ్లాప్ కావడంతో మార్కెట్ దెబ్బ తిన్నదని.. శర్వా సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయని వారు అంటున్నారు. శర్వా లాస్ట్ సినిమా 'జాను' బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడంతో ఆ ప్రభావం ఇప్పుడు 'శ్రీకారం' పై పడిందని.. నాన్ -థియేట్రికల్ రైట్స్ పెద్దగా డిమాండ్ లేదని అంటున్నారు. సినిమాపై పెద్దగా బజ్ లేకపోవడంతో థియేట్రికల్ రైట్స్ కు డీసెంట్ ఎడ్వాన్సులు రాబట్టటానికి నిర్మాతలు కష్టపడుతున్నారట.

ఇప్పటికే 14 రీల్స్ సంస్థ నిర్మించిన సినిమాల్లో ఎక్కువ శాతం లాస్ వెంచర్స్ గా నిలవడంతో సంస్థ కూడా ఆర్థికంగా ఇబ్బందులలో ఉందని మరో టాక్ ఉంది. మరి 'శ్రీకారం' బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచి అటు శర్వాకు ఇటు నిర్మాతకు రిలీఫ్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి.
Tags:    

Similar News