'బేబీ డాల్' మరియు 'చిట్టియన్ కలైయ్యావే' పాటలతో పాపులర్ అయిన సింగర్ కనికా కపూర్. యూకే నుండి తిరిగి వచ్చిన కనికా విదేశాల నుంచి వచ్చిన వారు పద్నాలుగు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలన్న సూచనను పాటించకపోగా.., రాష్ట్రపతితో సహా ఎందరో పొలిటిషన్లు వీఐపీలు అటెండ్ అయిన ఒక పార్టీకి హాజరై పలువురి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీలో పాల్గొన్న తర్వాత ఆమె కరోనా వైరస్ బారిన పడి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉంది. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన కనికా స్టార్ లా కాకుండా రోగిలా వ్యవహరించాలని చికిత్స చేసే వైద్యులు సూచించారంటే వారికి ఈ భామ ఎంతటి చుక్కలు చూపిస్తుందో అర్థమవుతుంది. ఇప్పటికే ఆమె వ్యవహారశైలితో దేశ ప్రజలందరి ఆగ్రహానికి గురి అవుతున్న ఈ అమ్మడు గురించి మరో వార్త బయటకి వచ్చింది.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కనికా వ్యవహారశైలి బాధ్యతారాహిత్యం, అజ్ఞానంపై కోపంగా ఉందంట. కనికా నివసించిన మరియు ఆమె తిరిగిన ప్రదేశాల వలన కరోనా భారిన పడిన ఎవరైనా ఆమె మీద కంప్లైంట్ చేస్తే హత్యారోపణల మీద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందంట. ఈ నేపథ్యంలో ఎవరైనా బాధితులు కనికా కపూర్ మీద కంప్లైంట్ చేస్తారేమో చూడాలి. విద్యావంతులు సెలెబ్రెటీలు ఇలాంటి సమయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.