మెగా 152కు కాస్ట్‌ కట్టింగ్స్‌ నిజమేనా?

Update: 2019-11-20 11:31 GMT
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రంను రామ్‌ చరణ్‌ దాదాపుగా 300 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించిన విషయం తెల్సిందే. సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగానే రాబట్టినా ఇతర ప్రాంతాల్లో దారుణంగా నిరాశ పర్చింది. నిర్మాత రామ్‌ చరణ్‌ కు భారీగానే నష్టాలు మిగిలినట్లుగా ఇండస్ట్రీల్లో టాక్‌ నడుస్తుంది. సైరాకు నష్టం కారణంగా చరణ్‌ నిర్మిస్తున్న తదుపరి చిత్రం చిరంజీవి 152కు కాస్ట్‌ కట్టింగ్‌ పెడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మించాలని భావించినా కూడా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఖర్చు తగ్గిస్తున్నారట.

దర్శకుడు కొరటాల శివతో స్వయంగా రామ్‌ చరణ్‌ కాస్ట్‌ కట్టింగ్‌ గురించి చర్చించాడట. సాధ్యం అయినంత వరకు ఖర్చు తగ్గేలా చూడాలని కొరటాల శివను చరణ్‌ కోరాడని అందుకే కొరటాల శివ మళ్లీ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో అనుకున్న సెట్లు మరియు ఔట్‌ డోర్‌ షూటింగ్‌ ల విషయంలో ప్లాన్స్‌ చేంజ్‌ చేస్తున్నారట. అందుకే సినిమా ఆలస్యం అవుతుందని ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు హీరోయిన్‌ విషయంలో కూడా కాస్ట్‌ కట్టింగ్‌ చేస్తున్నారట.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం స్టార్‌ హీరోయిన్స్‌ ను ఎవరిని టచ్‌ చేసినా కూడా కోట్లల్లో పారితోషికం అడుగుతున్నారని.. చిరంజీవి సినిమాకు ఏ హీరోయిన్‌ అయినా నడిచిపోతుంది. కనుక కొత్త హీరోయిన్‌ ను తక్కువ పారితోషికంకు వచ్చేలా ప్లాప్‌ చేస్తున్నారట. గతంలో శంకర్‌ దాదా జిందాబాద్‌ చిత్రాన్నికి తీసుకు వచ్చిన కొత్త హీరోయిన్‌ ను లేదంటే ఫామ్‌ లో లేని త్రిషను అయినా ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటింపజేసే అవకాశం ఉందని టాక్‌ నడుస్తుంది.

కాని మెగా వర్గాల వారు మాత్రం అవన్నీ పుకార్లని బడ్జెట్‌ విషయంలో ఎలాంటి వెనకడుగు లేకుండా నిర్మాత రామ్‌ చరణ్‌ ఈ సినిమాను నిర్మించనున్నాడు అంటున్నారు. కథానుసారంగా హీరోయిన్‌ ఎవరు అయితే కరెక్ట్‌ అనుకుంటారో వారిని తీసుకుంటారని మెగా ఫ్యాన్స్‌ చెబుతున్నారు. సైరా ప్రభావం ఒక్క శాతం కూడా చిరు 152పై పడదంటూ వారు నమ్మకంగా చెబుతున్నారు. మొత్తానికి ఎవరి వాదన వారిది అన్నట్లుగా ఉంది. సినిమా ప్రారంభం అయితే కాని అసలు విషయం తెలియదు.
Tags:    

Similar News