కంగనా రనౌత్‌పై పెట్టిన దేశద్రోహం కేసుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడితే దేశద్రోహం కేసు పెట్టడమేమిటని ప్రశ్నించింది. ఇటీవల కొంతకాలంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై , బాలీవుడ్‌పై ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. సుశాంత్ రాజ్‌పుత్ కేసు, డ్రగ్స్ వ్యవహారం, నెపొటిజంపై కూడా ఆమె మాట్లాడారు. ఓ దశలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే, ఆయన కుమారుడిపై కూడా ఆరోపణలు చేశారు.
అయితే ముంబై పోలీసులు ఆమె మీద దేశద్రోహం కేసు పెట్టారు. దీంతో కంగనా తరఫు న్యాయవాది కోర్టుకు వెళ్లారు. తన క్లయింట్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పోస్టులు పెడితే ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు పై విధంగా వ్యాఖ్యానించింది. కంగనా అరెస్ట్‌ను ఆపుతూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలి చండేల్‌పై ముంబై పోలీసులు దాఖలు చేసిన దేశ ద్రోహం కేసుపై బాంబే హైకోర్టులో వాడీవేడిగా వాదలనలు సాగాయి. ఈ సందర్భంగా జస్టిస్ షిండే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘దేశ పౌరులను ఇలానే ట్రీట్ చేస్తారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఐపీసీ 124ఏ సెక్షన్ విధిస్తారా. 124 ఏ సెక్షన్ ఎప్పుడు పెట్టాలో పోలీసులకు కనీసం అవగాహన ఉందా? ముందు అధికారులు తమ కిందిస్థాయి పోలీసులకు ఈ సెక్షన్‌పై ట్రైనింగ్ ఇవ్వండి.’ అంటూ షిండే మండి పడ్డారు. మరోవైపు విచారణకు కంగనా గైర్హాజరు కాకపోవడంపై కూడా జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.