ఉపాస‌న‌కి కోవిడ్ పాజిటివ్..చెన్నై ప్ర‌యాణం క్యాన్సిల్!

Update: 2022-05-11 07:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి..వ్యాపార వేత్త ఉపాస‌న కోవిడ్ బారిన ప‌డ్డారు. కుటుంబ స‌భ్యుల్ని క‌లిస‌లేందుకు చెన్నై వెళ్లే క్ర‌మంలో కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె వెంట‌నే క్వారంటైన్ లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఉపాస‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా కొద్ది సేప‌టి క్రిత‌మే తెలిపారు.

''గ‌త వార‌మే కోవిడ్ సోకింది. ప్ర‌స్తుతం కోలుకున్నా.  ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుటున్నా.  వ్యాక్సినేష‌న్ తీసుకోవ‌డంతో స్వ‌ల్పంగానే ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.  దీంతో వైద్యులు కొన్ని ర‌కాల మందులిచ్చారు. వాటితోనే కోలుకోగ‌లిగాను. ప్ర‌స్తుతం శారీర‌కంగా మాన‌సింగా ధైర్యంగా ఉన్నాను'  అని తెలిపారు. అలాగే మ‌ళ్లీ కోవిడ్ వ‌స్తుందా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేసారు.

''ఏమో చెప్ప‌లేం. మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండాలి. అలాల‌గే  సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని ఆస్వాదించాలి. అన‌వ‌స‌ర భ‌యాలు..ఆందోళ‌న‌కు గురికావొద్దు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డం వ‌ల్ల నాకు వైర‌స్ సోకింది అన్న విష‌యం తెలిసింది. ఎలాంటి ప‌రీక్ష‌లు చేయించుకోకుండా ఉంటే వైర‌స్ సోకింద‌న్న విష‌యం తెలిసేది కాదు.

అందుకోసం ఎప్పుడూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని'' ఉపాస‌న  సూచించారు. అయితే ఉపాస‌న‌కి సోకిన కోవిడ్ వేరియంట్ వివ‌రాలు మాత్రం రివీల్ చేయ‌లేదు. ఫోర్త్ వేవ్ లో కొత్త ర‌కం వైర‌స్ విజృంభిస్తుంది. వృద్దుల‌పై ఈ వైర‌స్ తీవ్ర ప్ర‌భావాన్ని చూపుతుంద‌ని అంటున్నారు.

ఇప్ప‌ట‌లికే జూన్..జులై నుంచి ఫోర్త్ వేవ్ కూడా ఉంటుంద‌ని  హెచ్చ‌రిక‌లు జారీ అయిన సంగ‌తి తెలిసిందే. కొన్ని దేశాల్లో ఫోర్త్ వేవ్ ర‌న్నింగ్ లో ఉంది. చైనాలో పూర్తి లాక్ డౌన్ అమ‌ల‌వుతుంది. ఈనేప‌థ్యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం రాష్ర్టాల్ని అప్ర‌మ‌త్తం చేస్తుంది.

ఇక ఉపాస‌న గ‌తంలో  కోవిడ్ పై అవేర్ నెస్ వీడియోలు  చేసిన సంగ‌తి తెలిసిందే. బాద్య‌త‌గ‌ల పౌరురాలిగా త‌న బాధ్య‌త‌ను నిర్వ‌హించారు. త‌న స్నేహితుల‌తో క‌లిసి కోవిడ్ అవేర్ నెస్ కార్య‌క్ర‌మంలో భాగ‌మ‌య్యారు. ఇప్ప‌టికే  రెండు..మూడు కోవిడ్ వేవ్ ల్లో చాలా మంది సెల‌బ్రిటీలు వైర‌స్ బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.  అన్ని భాష‌ల సెల‌బ్రిటీలు వైర‌స్ తో ఇబ్బంది ప‌డ్డారు.  కొంత మంది కోవిడ్ కార‌ణంగా మృతి  చెందారు.
Tags:    

Similar News