కోవిడ్ ముప్పు: హైదరాబాద్‌ లో పడిపోయిన సినిమా కలెక్షన్లు

Update: 2022-01-22 07:02 GMT
తెలంగాణ లో కరోనా ఎఫెక్ట్ భారీగానే పడింది. ఓమిక్రాన్ తీవత్ర బాగా కనిపిస్తోంది. కోవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. కేసులు తక్కువగా ఉన్నప్పటికీ తీవ్రత గణనీయంగా పెరుగుతోందని ప్రజలు అర్థం చేసుకున్నారు. కోవిడ్19 వ్యాప్తితో కొత్త సినిమాల కలెక్షన్‌ల పై ప్రభావం చూపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ లో మంచి వసూళ్లను సాధిస్తున్న “బంగార్రాజు” హైదరాబాద్‌ లో మాత్రం సత్తా చాటలేకపోయింది. "రౌడీ బాయ్స్" ,"హీరో" వంటి ఇతర సినిమాలు అదే ఫలితాన్ని ఇస్తున్నాయి.  మల్టీప్లెక్స్‌ల లో అన్ని సినిమాలకు తక్కువ సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు. కోవిడ్ కల్లోలంలో సినిమాలు చూడడానికి ముందుకు రావడం లేదు. ఈ వీకెండ్ కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.

ప్రజలు ఇప్పుడు థియేటర్‌లకు వెళ్లకుండా మళ్లీ ఓటీటీ ప్లాట్‌ ఫారమ్‌ల లో సినిమాలు చూడటం ప్రారంభించారు. డిసెంబర్‌ లో హైదరాబాద్‌ తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో అన్ని తెలుగు సినిమాలకు కలెక్షన్లు భారీగా వచ్చాయి. "అఖండ", "పుష్ప", "శ్యామ్ సింఘా రాయ్" ఇప్పుడు లాభాల బాటపట్టాయి.

కానీ జనవరిలో  కోవిడ్19 కేసులు పెరుగుతున్నాయి. దీంతో జనాలు థియేటర్లలోకి అడుగు పెట్టడం లేదు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో సినిమా కలెక్షన్లు పడిపోయాయి.
Tags:    

Similar News