టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ల నుంచి క్రేజీ డైరెక్టర్ల వరకు వరుస సినిమాలతో బిజీ బిజీగా గడిపేస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో రాణిస్తూనే మన స్టార్ డైరెక్టర్లు, క్రేజీ యంగ్ డైరెక్టర్స్ ఈ మధ్య స్టార్ ప్రొడ్యూసర్స్ ని ఫాలో అవుతున్నారట. ఇండస్ట్రీలో పేరున్న చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్స్ సినిమాలని మించి రియల్ ఎస్టేజ్ బిజినెస్ లో రాణిస్తున్నారు. చిన్న ప్రొడ్యూసర్ల నుంచి స్టార్ ప్రొడ్యూసర్ల వరకు ప్రైవేట్ వెంచర్లు వేస్తూ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు.
భవ్య క్రియేషన్స్ నుంచి దిల్ రాజు ఎస్వీసీ వెంచర్స్ వరకు .. అలాగే దుర్గా ఆర్ట్స్ అధినేత కె. ఎల్. నారాయణ నుంచి యువీ వరకు భారీ వెంచర్స్ ని ఏర్పాటు చేసి విల్లాలు, ప్లాట్లు విక్రయిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ బిజినెస్ రంగంలోకి కొత్తగా స్టార్ డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు కూడా వచ్చి చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సీమ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన డైరెక్టర్ నుంచి మినిమమ్ గ్యారెంటీ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ వరకు రియల్ ఎస్టేట్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారట.
ఇప్పటికే ఓ యంగ్ డైరెక్టర్ భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు పోగేసినట్టుగా ఇన్ సైడ్ టాక్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తో కలిసి సదరు డైరెక్టర్ రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించారని, అప్పటి నుంచి కోట్లల్లో లాభాల్ని దక్కించుకున్నారని చెబుతున్నారు. సినిమాల్లో ఈ మధ్య వీక్ అనిపించుకుంటున్నా రియల్ రంగంలో మాత్రం క్రేజీ డైరెక్టర్లు తమ హావాని చూపిస్తున్నారట.
సినిమాలపై ఆసక్తిని తగ్గించుకుని సదరు దర్శకులు రియల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం రియల్ భూమ్ బాగా వుండటం.. సినిమాలతో పోలిస్తే సేఫ్టీ ఎక్కువగా వుండటమేనని, అంతే కాకుండా కోట్లల్లో లాభాలు వస్తుండటం కూడా ఓ కారణమని చెబుతున్నారు. దీంతో చాలా మంది క్రేజీ డైరెక్టర్స్ రియల్ రంగం వైపు అడుగులు వేస్తున్నారని, ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా సక్సెస్ లు సాధించలేకపోతున్నా రియల్ ఎస్టేట్ లోనే క్రేజీ డైరెక్టర్స్ హవా చూపిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నారు.