'గని' వంటి భారీ డిజాస్టర్ తరువాత వరుణ్ తేజ్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ మూవీ తరువాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన వరుణ్ తేజ్ ఈ మూవీతో పాటు తన తొలి పాన్ ఇండియా మూవీకి రెడీ అయిపోయిన విషయం తెలిసిందే. బాక్సర్ కనిపించడం కోసం చాలా శ్రమించిన వరుణ్ తేజ్ 'గని'పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అయితే ఆ అంచనాల్ని ఏ మాత్రం రీచ్ కాలేక వరుణ్ తేజ్ కు భారీ డిజాస్టర్ ని అందించింది.
ఈ నేపథ్యంలో సెలెక్టీవ్ గా సినిమాలు అంగీకరిస్తున్న వరుణ్ తేజ్ .. ప్రవీణ్ సత్తారుతో పాటు మరో కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ మూవీని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఇటీవల జరిగిన పలు యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. సినిమాలో తొలి సారి వరుణ్ తేజ ఏయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా అత్యంత సాహసోపేతమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కతున్న ఈ మూవీ ద్వారా హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నాయి. కొన్ని రోజుల క్రితమే మేకర్స్ ఈ మూవీని అధికారికంగా ప్రకటించడమే కాకుండా లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ లో ప్రారంభించబోతున్నారని తెలిసింది.
వరుణ్ తేజ్ నటిస్తున్న 13వ ప్రాజెక్ట్ ఇది. VT 13 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో రూపొందనున్న ద్విభాషా చిత్రమిది. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏయిర్ మార్షల్స్ కి సంబంధించిన కథగా దేశ భక్తి నేపథ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభినందన్ వర్ధమాన్ సంఘటన స్ఫూర్తిగా ఈ మూవీ వుంటుందని తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఇందులో వరుణ్ తేజ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ ని చిత్ర బృందం ఎంపిక చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం లండన్ లో ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్ లో వున్న వరుణ్ తేజ్ త్వరలోనే తన VT 13 ని సెట్స్ పైకి తీసుళ్లనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటికి రానున్నాయని తెలిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.