ఇన్ సైడ్ టాక్‌: ఏ సినిమా ఎంత పెండింగ్?

Update: 2020-05-24 06:10 GMT
మ‌హ‌మ్మారీ నిర్భంధ‌నం టాలీవుడ్ ని ఇర‌కాటంలో పెట్టేసిన సంగ‌తి తెలిసిందే. స్టార్లంతా రెండు నెల‌లుగా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. లాక్ డౌన్ల‌తో షూటింగుల్లేక తార‌లంతా కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సినీపెద్ద‌ల సంప్ర‌దింపుల అనంత‌రం ఇటీవ‌లే కేసీఆర్ ప్ర‌భుత్వం సినిమా షూటింగుల విష‌యంలో నిబంధ‌న‌ల్ని స‌డ‌లించ‌డంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఊపిరి పీల్చుకుంది. వైర‌స్ భారిన ప‌డ‌కుండా.. కొన్ని క‌ఠిన నియ‌మాల్ని పాటిస్తూ షూటింగులు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది. జూన్ తొలి వారం నుంచి తిరిగి సెట్స్ కెళ్లే వెసులుబాటును క‌ల్పించారు. అటు ఏపీలోనూ షూటింగుల‌కు సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌డం పెద్ద ఊర‌ట‌.

అదంతా స‌రే కానీ.. ప్ర‌స్తుత క్రేజీ సినిమాల్లో ఏ సినిమా షూటింగ్ ఎంత పెండింగ్ ఉంది? అన్న వివ‌రాల్ని ప‌రిశీలిస్తే.. తెలిసిన ఆస‌క్తిక‌ర సంగ‌తులివి. చిరు ఆచార్య 60శాతం.. నాగార్జున వైల్డ్ డాగ్ 50 శాతం.. వెంకీ నార‌ప్ప 30 శాతం.. ప్ర‌భాస్ ఓ డియ‌ర్ 30 శాతం.. ర‌వితేజ క్రాక్ 10 శాతం.. ప‌వ‌న్ వ‌కీల్ సాబ్ 25 శాతం.. నాగ‌చైత‌న్య ల‌వ్ స్టోరి 10 శాతం.. నానీ ట‌క్ జ‌గ‌దీష్ 60 శాతం .. విజ‌య్ ఫైట‌ర్ 60 శాతం .. గోపీచంద్ సీటీమార్ 70శాతం .. పూర్తి కావాల్సి ఉంద‌ని తెలిసింది.

పెండింగ్ షూట్ పూర్త‌య్యాకే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చేసే వీలుంటుంది. వీటిలో 10 శాతం నుంచి 30 శాతం లోపు ఉన్న సినిమాల‌కు మాత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ వేగంగా పూర్తి చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్ప‌టికే పోస్ట్ ప్రొడ‌క్షన్స్ కి వెసులుబాటు క‌ల్పించారు కాబ‌ట్టి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో నూత‌నోత్సాహం నెల‌కొంది. షూటింగులు తిరిగి ప్రారంభించేస్తే రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లే వీలుంది. అయితే వైర‌స్ సెగ తాక కుండా కావాల్సిన‌న్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది. అస‌లు ఎలా షూటింగ్ చేస్తారు? అన్న మ్యాక్ డ్రిల్ త‌ర‌హా ఆన్ లొకేష‌న్ షూటింగ్ కి సంబంధించిన‌ వీడియోని స‌మ‌ర్పించాల్సిందిగా తెలంగాణ ప్ర‌భుత్వం కోరిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News