క్రికెట్ గాడ్ డాట‌ర్ ఎంట్రీ ఇచ్చేసిందిగా

Update: 2021-12-07 09:32 GMT
ఇండియా క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ కుమార్తె సారా టెండూల్క‌ర్ రూట్ అనూహ్యంగా యూట‌ర్న్ తిరుగుతోంది. ఈ భామ ఇటీవ‌ల ఓపెన‌ప్ అవుతోంది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌స్తూ ఫోటోషూట్ల‌తో మ‌తులు చెడ‌గొడుతున్న తీరు ర‌క‌ర‌కాల సందేహాల‌కు తావిచ్చింది.

స్ట‌డీస్ కొనసాగిస్తున్న నేప‌థ్యంలో ఏ రంగంలో స్థిర‌ప‌డుతుంది! అన్న‌దానిపై ఇన్నాళ్లు సందిగ్ధ‌త ఉండేది. అయితే ఇప్పుడు వాటన్నింటికి తెర దించుతు సారా టెండూల్క‌ర్ మోడ‌లింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఓ ప్ర‌మోష‌నల్ యాడ్ షూట్ లో మ‌రో ఇద్ద‌రు మోడ‌ల్స్ తో క‌లిసి సారా క్యాట్ వాక్ చేసింది.

సారా ఇలా ఎందుకు చేసింది? అంటే ఓ పాపుల‌ర్ దుస్తుల కంపెనీ యాడ్ లో న‌టించ‌డమే ఇందుకు కార‌ణం. న‌టి బానిటా సంధు.. తానియా ష్రాప్ లతో క‌లిసి మోద‌టిసారి సారా కెమెరా ముందుకొచ్చింది. వెలుగులు విర‌జిమ్మింది.

సారా చాలా ప్రోఫెష‌న‌ల్ లుక్ తో క‌నిపిస్తుంది. అనుభ‌వం ఉన్న‌ మోడ‌ల్ త‌ర‌హాలో మెప్పించింది. దానికి సంబంధించిన వీడియోని సారా త‌న ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. ముగ్గురు భామ‌లు ఎంతో అందంగా క‌నిపించారు. అంత‌ర్జాతీయ మోడ‌ల్స్ రేంజులో మెప్పించారంటూ ప్ర‌శంస‌లందుకుంటున్నారు.

సారాకి ఇన్ స్టాలో 1.5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ క‌లిగి ఉన్నారు. సారా ఫ్యాష‌న్ ఎంపిక‌లైపై నెటిజ‌నులు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శంసిస్తూనే ఉంటారు. సారా నిరంత‌రం ఫిట్ నెస్ వీడియోలు... ఫోటోలతో ఆక‌ట్టుకుంటోంది. మోడ‌లింగ్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో సారా బాలీవుడ్ ఎంట్రీకి స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లే క‌నిపిస్తోంద‌ని ఫ్యాన్స్ విషెస్ తెలియ‌జేస్తున్నారు.

తండ్రి స‌చిన్ పెద్ద క్రికెట‌ర్. కుమారుడు అర్జున్ టెండుల్క‌ర్ ని ఫాస్ట్ బౌల‌ర్ గా తీర్చిదిద్దుతున్నారు. ఇక కుమార్తెని న‌టిగా చూడాల‌నుకుంటున్నారు.

అందుకే ముందుగా మోడ‌లింగ్ రంగంలోకి దించారు. ఇక్క‌డ నుంచి నేరుగా బాలీవుడ్ కి ప్రోట్ అవుతుంది. అక్క‌డ స‌క్సెస్ అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతుంది. స‌చిన్ కి వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబ‌ట్టి సారా కి ఆ క్రేజ్ పెద్ద అస్సెట్ అవుతుంది.


Full View
Tags:    

Similar News