మృణాల్ ఠాకూర్.. గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ లో మార్మోగిపోతున్న పేరు ఇది. 2012లో సీరియల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. 2014లో విడుదలైన 'విట్టి దండు' అనే సూపర్ హిట్ మరాఠీ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'లవ్ సోనియా' మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో ఓ పల్లెటూరి అమ్మాయి గా తన సహజ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమా అనంతరం బాలీవుడ్ లో వరుస ఆఫర్లు ను అందుకున్న మృణాల్ ఠాకూర్.. ఇటీవల 'సీతారామం' మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై అశ్వినీదత్, స్వప్నాదత్ సంయుక్తంగా నిర్మించారు.
ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా నటించారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రను పోషించిన మృణాల్ ఠాకూర్.. ఆకట్టుకునే నటనతో పాటు మైమరపించే అందంతో ప్రేక్షకుల మనసులు దోచేసింది.
ఈ సినిమాలో బాపు బొమ్మలా కనిపించి అందరి ప్రశంసలు అందుకున్న మృణాల్ ఠాకూర్ కు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు సైతం ఆమెతో సినిమాలు చేసేందుకు ముచ్చట పడుతున్నారు. ఇలాంటి తరుణంలో పొగడ్తల వర్షం కురిపించిన వారే మృణాల్ కు చివాట్లు పెడుతున్నారు. అందుకు కారణం లేకపోలేదు.
'సీతారామం' సినిమాలో ఎంతో పద్ధతిగా అచ్చతెలుగు ఆడపిల్లలా కనిపించిన మృణాల్.. సోషల్ మీడియా వేదికగా విపరీతమైన స్కిన్ షో చేస్తూ దర్శనమిస్తోంది. సీత పాత్రలో క్లాసికల్ లుక్ లో చెరుగని ముద్ర వేసుకున్న ఆమె.. ఇప్పుడిలా క్లీవేజ్ షో చేయడం కొందరికి ఏ మాత్రం నచ్చడం లేదు. అందులోనూ మృణాల్ రీసెంట్ గా చేసిన హాట్ ఫోటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటో షూట్ విషయంలో మృణాల్ పై కొందరు నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సీతామహాలక్ష్మి పాత్రలో ఎంతో అందంగా పద్దతిగా కనిపించిన మృణాల్.. ఇలా అందాలు ఆరబోయడం ఏ మాత్రం బాగోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరైతే హద్దులు దాటి కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా, సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోవాలంటే కేవలం నటన పరంగానే కాదు గ్లామర్ పరంగానూ ఆకట్టుకోవాలి. దాదాపు తొంబై శాతం హీరోయిన్లు ఇదే ఫాలో అవుతుంటారు. మృణాల్ కూడా అదే ప్రయత్నం చేసింది. కానీ, సీత పాత్రలో మృణాల్ ను చూశాక.. పాపం ఆమె స్కిన్ షోను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.