ప్రపంచవ్యాప్తంగా ఈ బాహుబలి-2 రికార్డు స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. యూట్యూబ్ లో ఏకంగా వంద మిలియన్ వ్యూస్ సాధించింది సరికొత్త ట్రెండ్ కు నాంది పలికింది. కానీ, ప్రభాస్ కు దక్కవలసిన క్రెడిట్ అంతా రామ్ చరణ్ కు దక్కింది.
బాహుబలి సినిమాకు - చెర్రీకి ఏం సంబంధం? ఆ రికార్డు చరణ్ సొంతం కావడమేమిటి? అనుకుంటున్నారా? దీనంతటికీ ఓ వ్యక్తి వినూత్న ఆలోచనే కారణం. గత ఏడాది ఫిబ్రవరిలో రామ్ చరణ్ నటించిన 'మగధీర చిత్రం హిందీ అనువాదానికి 'బాహుబలి-2 అని పేరుతో లింక్ చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడో మహానుభావుడు. అప్పటికి అసలు బాహుబలి-2 రిలీజ్ కాకపోవడంతో జనాలు ఆ లింక్ ను తెగ క్లిక్ చేసారు. ఆ మగధీర హిందీ అనువాదం యూట్యూబ్ లో సూపర్ హిట్ అయిపోయింది. వంద మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు అనువాద చిత్రంగా రికార్డు సాధించింది.
'బాహుబలి 2 కి ఉన్న క్రేజ్ ను ఆ వ్యక్తి బాగా క్యాష్ చేసుకున్నాడు. ఆ తర్వాత అది రాజమౌళి తీసిన మరో సినిమా అని జనానికి తెలిసింది. ఈ దీంతో, ఆ మూవీకి 57 వేలకి పైగా డిస్ లైకులు కూడా వచ్చాయి. వంద మిలియన్ వ్యూస్ ముందు ఆ డిజ్ లైకులు ఓ లెక్కా చెప్పండి.
ఈ పరిణామాన్ని ముందుగా ఊహించిన ఆ వ్యక్తి కామెంట్స్ డిసేబుల్ చేశాడు. దీంతో, జనం తిట్ల పురాణం నుంచి తప్పించుకున్నాడు. ఈ క్రాస్ లింక్ కు లక్షా యాభై వేల మంది లైక్ కొట్టడం విశేషం. మగధీరను అంతకుముందే హిందీలోకి అనువదించి ఉంటే సంచలనం సృష్టించేదేమో. యూట్యూబ్ వరకు ఈ చిత్రం ఒక గొప్ప రికార్డుని సాధించింది. టైటిల్ తో చేసిన గిమ్మిక్ ని పట్టించుకోకుండా చరణ్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/