గ్లోబల్ స్టార్‌ కూతురు క్యూట్‌ పిక్‌

Update: 2022-11-23 16:30 GMT
బాలీవుడ్ తో పాటు హాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించి గ్లోబల్ స్టార్‌ అనిపించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా కూతురును చూడటం కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ఇన్‌ స్టా లో 83 మిలియన్‌ లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న విషయం తెల్సిందే.

అంత మంది కూడా ప్రియాంక చోప్రా కూతురు యొక్క పిక్స్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఆమె మాత్రం మెల్ల మెల్లగా రివీల్‌ చేస్తూ వస్తోంది. ఇప్పటి వరకు కూతురు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ యొక్క ఫేస్ ను రివీల్‌ చేయకుండా వెనుక వైపు చూపించడం.. కాళ్లు లేదా చేతులు చూపించడం వంటివి చేస్తూ వచ్చింది.

ఎట్టకేలకు ఫేస్ ను ప్రియాంక చోప్రా రివీల్‌ చేసింది. పూర్తిగా ఫేస్ ను రివీల్ చేయలేదు కానీ మాల్తీ యొక్క ఫేస్ ను ఒకింత చూపిస్తూ ఈ ఫొటోను షేర్‌ చేయడం జరిగింది. ఫేస్ పూర్తిగా కనిపించకున్నా కూడా చాలా క్యూట్‌ గా ఈ ఫొటోలో మాల్తీ కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ పెద్ద ఎత్తున ఈ ఫొటోను షేర్‌ చేస్తున్నారు.

ఈ ఏడాది జనవరి లో ప్రియాంక చోప్రా మరియు నిక్ జోనస్ లకు మాల్తీ మేరీ చోప్రా జోనాస్ జన్మించింది. ఈ జంట సరోగసి విధానం ద్వారా తల్లిదండ్రులు అయిన విషయం తెల్సిందే. పాప పుట్టినప్పటి నుండి కూడా వీరిద్దరు చాలా ఆనందం గా కనిపిస్తూ ఉన్నారు. సోషల్‌ మీడియాలో పాపకు సంబంధించిన విషయాలను షేర్‌ చేస్తున్నారు.

ప్రియాంక చోప్రా వయసు లో భర్త నిక్ జోనస్ కంటే పదేళ్లు పెద్దది. దాంతో వీరి పెళ్లి సమయంలో కచ్చితంగా వీరి సంసారం కొన్నాళ్ల కంటే ఎక్కువ కాలం సాగే పరిస్థితి కనిపించడం లేదు అంటూ విమర్శలు వచ్చాయి. కొందరు ఆ మధ్య నిక్ మరియు ప్రియాంక లు విడి పోయారు అంటూ ప్రచారం చేశారు. కానీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నారు.. కూతురు మాల్తీ తో చక్కని ఫ్యామిలీ లైప్ ను ఎంజాయ్‌ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News