హీరో అన్నారుగా.. ఈ పనులేంటో మరి

Update: 2016-07-27 03:52 GMT
సినిమా హీరో అవ్వాలంటే సినిమా రంగంలో ఏదన్నా ఎక్సపీరియన్స్ ఉండాలా? అబ్బే అక్కర్లేదు. కేవలం షార్టు ఫిలింస్ లో యాక్టు చేసిన కుర్రాళ్లు ఎంతమంది హీరోలుగా చలామణి కావట్లేదేంటి? కాకపోతే కొందరు స్టార్ కిడ్స్ మాత్రం హీరో అవ్వడానికి ముందు ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.

అప్పట్లో ఒక మ్యాగజైన్ నడిపాడు అల్లు శిరీష్‌. ఆ తరువాత తన తండ్రి ప్రొడక్షన్‌ కంపెనీలో కొన్ని వ్యవహారాలు చూసుకునేవాడు. ఆ తరువాత హీరోగా అవతారం ఎత్తాడు. అలాగే అఖిల్ కూడా కొన్ని షార్టు ఫిలింస్ లో నటించి.. ఆ తరువాత హీరో క్యారెక్టర్ లోకి ప్రవేశించాడు. ఇప్పుడు దగ్గుబాటి సురేష్‌ బాబు చిన్న కొడుకు కూడా అదే విధంగా ఫాలో అయిపోతున్నట్లున్నాడు. రామానాయుడు స్టూడియలో ''పెళ్లిచూపులు'' సినిమా ప్రీమియర్లు ఆర్గనైజ్ చేయడం దగ్గర నుండి.. ఇప్పుడు విజయవాడలో ప్రీమియర్ షో కు అటెండయ్యి ఒక డిస్ర్టిబ్యూటర్ గా మైకుల ముందు మాట్టాడటం వరకు రానా తమ్మడు అభిరామ్ స్వయంగా చేస్తున్నాడు. అంటే హీరో అవ్వాలంటే ఇలా ఏదో ఒక ఎక్స్ పీరియన్స్ ఉండాలని కాబోలు.

త్వరలోనే వంశీ డైరక్షన్లో.. లేడీస్ టైలర్ సీక్వెల్ గా రానున్న ఫ్యాషన్‌ డిజైనర్ సినిమాతో.. అభిరామ్ తెరంగేట్రం చేస్తాడని ఇప్పటికే టాక్‌ బయటకు వచ్చేసింది. చూద్దాం ఈ ప్రాజెక్టును ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో!!
Tags:    

Similar News