అరెరే! ద‌బంగ్3 ఈవెంట్‌ కి టీమిండియా సెగ‌!!

Update: 2019-12-18 13:29 GMT
స‌ల్మాన్ భాయ్ న‌టించిన `ద‌బంగ్ 3` హిందీ స‌హా ద‌క్షిణాది భాష‌ల్లోనూ అత్యంత‌ భారీగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఓవైపు డ్రీమ్ ప్రాజెక్ట్ `వెంకీమామ` థియేట‌ర్ల‌లో ఆడుతున్నా ద‌బంగ్ 3 లాంటి డ‌బ్బింగ్ చిత్రాన్ని ఏపీ-తెలంగాణ‌లో రిలీజ్ చేస్తుండ‌డం సురేష్ బాబు బిజినెస్ స్ట్రాట‌జీని ఎలివేట్ చేస్తోంది.

నేడు తెలుగు వ‌ర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ ని హైద‌రాబాద్ జేఆర్సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో ఘ‌నంగా ప్లాన్ చేసింది చిత్ర‌బృందం. ఈ వేడుక‌కు స్నేహితుడు స‌ల్మాన్ భాయ్ కోసం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. విక్ట‌రీ వెంక‌టేష్ విచ్చేస్తుండ‌డంతో అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది. అయితే నేటి (బుధ‌వారం) సాయంత్రం టీవీల్లో టీమిండియా వ‌న్డే మ్యాచ్ హీట్ ఈ వేడుక‌పై ప్ర‌భావం చూప‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

విశాఖ‌లో జ‌రుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా చెల‌రేగి 387 ప‌రుగులు సాధించింది. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ - కే.ఎల్.రాహుల్ చెరో సెంచ‌రీ చేసి 200 పైగా ప‌రుగుల భాగ‌స్వామ్యంతో స‌రికొత్త ట్రాక్ ని నిర్మించ‌డంతో ఇంత పెద్ద టార్గెట్ సాధ్య‌మైంది. వెస్టిండీస్ ఒక వికెట్ కోల్పోయి 388 టార్గెట్ ఛేదించేందుకు పోరాటం సాగిస్తోంది. టీమిండియా బాదుడుతో వీర‌లెవ‌ల్ స్కోర్ ని ఛేధించాల్సిన ప‌రిస్థితి ఉంది. అయితే టీవీల‌కు అతుక్కున్న ఫ్యాన్స్ ద‌బంగ్ 3 ఈవెంట్ చూస్తారా?   లేదూ వ‌న్డే మ్యాచ్ ని ప్రిఫ‌ర్ చేస్తారా? అన్న‌ది చూడాలి.


Tags:    

Similar News