రామానాయుడు వారసుడొస్తున్నాడు

Update: 2018-02-27 05:24 GMT
ఇండస్ట్రీపై గట్టి పట్టు.. బలమైన బ్యాక్ గ్రౌండ్.. కావాల్సినంత డబ్బు.. కాస్త ఫ్యామిలీ సపోర్ట్..  వీటితోపాటు కాస్త ఆకట్టుకునే ఫిజిక్ ఉంటే చాలు టాలీవుడ్ లో హీరోగా అదృష్టం పరీక్షించుకోవచ్చు. కాలం కలిసొస్తే నిలదొక్కుకోనూవచ్చు. ఇవన్నీ ఉండి హీరోగా అడుగు పెడితే విచిత్రం ఏమీలేదు. ఇన్నీ ఉండీ హీరో అవదామనే ఆలోచన మానుకోవడం మాత్రం విశేషమే.

ఇండస్ట్రీల్లో పెద్ద నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ పెద్ద కొడుకు రానా హీరోగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా రానాకు ఆఫర్లు వస్తున్నాయి. సురేష్ రెండో అభిరాంను కూడా హీరో చేద్దామని అప్పట్లో అనుకున్నారు. సురేష్ కు సన్నిహితులైన నిర్మాతల ద్వారా లాంచ్ చేద్దామని ప్రయత్నాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన నుంచి సురేష్ డ్రాపయిపోయారని తెలుస్తోంది. రానా ఎలాగూ హీరోగా పేరు తెచ్చుకున్నందున అభిరాంకు ప్రొడక్షన్ బాధ్యతలు అప్పగించేందుకు డిసైడయ్యారనేది సన్నిహితుల మాట.

లెజండరీ నిర్మాత రామానాయుడు ఇద్దరు కొడుకుల్లో ఒకరైన సురేష్ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రొడక్షన్.. స్టూడియో.. బిజినెస్ లో మంచిచెడులు చూసుకుంటూ వచ్చారు. రెండోకొడుకు వెంకటేష్ ఫుల్ గా సినిమాలపై ఫోకస్ పెట్టి టాప్ హీరో అయ్యాడు. కుటుంబంలో ఒకరైనా తనలా ప్రొడక్షన్ చూసుకుంటే బాగుంటుందని సురేష్ ఫీలయ్యాడట. అభిరాం ఇంతకుముందు కొన్ని సినిమాలకు సంబంధించి ప్రొడక్షన్ వ్యవహారాలు దగ్గరుండి చూసుకున్నాడు. ఇప్పుడు తండ్రి మాటకు ఓకే చెప్పేసి పూర్తిగా అటువైపు ఫోకస్ పెట్టేపనిలో పడిపోయాడు.  సో.. ఆరకంగా రామానాయుడు సురేష్ ల వారసత్వాన్ని అభిరాం కంటిన్యూ చేస్తాడన్న మాట.
Tags:    

Similar News