'మాస్టర్' దళపతి.. బాలీవుడ్ ఎంట్రీ సక్సెస్ అవుతుందా..??

Update: 2020-12-28 02:30 GMT
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అదే రేంజ్ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న హీరో ఇళయదళపతి విజయ్. విజయ్ సినిమా అంటేనే కోలీవుడ్ బాక్సాఫీస్ మొత్తం ఊగిపోతోంది. మాములుగా విజయ్ సినిమా వస్తుందంటేనే అభిమానులు తారాస్థాయిలో సందడి చేస్తారు. అలాంటిది తమ అభిమాన హీరో సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతుందంటే ఆ వేడుకలు ఏ రేంజ్ లో చేస్తారో ఊహించండి. అయితే గతేడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన విజయ్ సినిమా మాస్టర్. బిగిల్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి మాస్టర్ సినిమా పై అటు తమిళ ఇటు తెలుగు ప్రేక్షకులలో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, టీజర్స్ అన్ని ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేసాయి. అయితే అందరూ హీరోల లాగే దళపతి కూడా పాన్ ఇండియా వైడ్ సినిమా విడుదల చేసే టైం వచ్చేసిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మాస్టర్ హిందీలోకి కూడా డబ్ అవుతుందని ఆఫీసియల్ గా అనౌన్స్ చేసింది చిత్రబృందం.

అయితే ఆల్రెడీ కేజీఎఫ్ సినిమా కన్నడ స్టార్ హీరో యష్ ను పాన్ ఇండియన్ స్టార్ చేసింది. అంతేగాక యష్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. ఇంకా రానున్న ప్రాజెక్ట్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బాలీవుడ్ జనాలు ఎప్పుడెప్పుడు కేజీఎఫ్-2 రిలీజ్ చేస్తారా.. అని ఎదురు చూస్తున్నారు. అక్కడ కేజీఎఫ్ సినిమా కోసం బాలీవుడ్ వర్గాలు కూడా హెల్ప్ చేసాయి. కానీ దళపతి మాస్టర్ అనేది కేవలం కమర్షియల్ మూవీ. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా దీన్ని తెరకెక్కించలేదు. నగరం, ఖైదీ సినిమాలతో కమర్షియల్ హిట్స్ కొట్టిన లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందించాడు. మాస్ అంటే కాస్త రొటీన్ కి భిన్నంగా చూపించి టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు లోకేష్. మరి విజయ్ కమర్షియల్ మాస్టర్ కి తెలుగులో ఆల్రెడీ మంచి మార్కెట్ ఉంది. కానీ బాలీవుడ్ లో కమర్షియల్ సినిమాతో ఎంట్రీ అంటే అక్కడి వర్గాల అవసరం ఎంతైనా ఉంటుంది. మాస్టర్ సినిమాను బాలీవుడ్ లో బి4యూ మోషన్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుంది. చూడాలి మరి కేజీఎఫ్ లాగే మాస్టర్ కూడా క్లిక్ అయి విజయ్ కి మార్కెట్ ఏర్పడుతుందేమో.. అదేగనక జరిగితే వచ్చే సినిమాల నుండి దళపతి సినిమాలు కూడా వరుస పాన్ ఇండియా సినిమాలు అయ్యే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరగనుందో..!!

Tags:    

Similar News