విడుదలైన మాతృకలోనే కాకుండా అనువాదమైన ప్రతీచోటా వసూళ్ళ వర్షం కురిపించి విజయపథాన దూసుకుపోతున్న సినిమా 'దంగల్'. ఈ సినిమాలో కుస్తీ పోటీలలో తన దేశానికి పతకం తెప్పించడానికి ఒక తండ్రి పడే తపనని ఆమీర్ ఖాన్ అద్భుతంగా ప్రదర్శించాడు. ఆమీర్ కి సమానంగా చిత్రంలో మరో రెండు ముఖ్యపాత్రలు గీతా - బబితాల పాత్రధారులు కూడా చక్కగా కుదిరారు.
అయితే దంగల్ దెబ్బ ఇప్పుడు తెలుగులో వెంకీకి పడే అవకాశం వుంది. స్టోరీ అవుట్ లైన్ పరంగా చూసుకుంటే మాధవన్ నటించిన సాలా ఖాద్దుస్ కి దంగల్ కి చాలానే పోలికలు వున్నాయి. మెయిన్ క్యారక్టర్ కి బాక్సింగ్ ఇష్టం లేకపోవడం - పంతంతో నేర్చుకోవడం - వేరే వారి కోచింగ్ తీసుకోవడం చివర్లో తమ స్థానాన్ని వదులుకుని శిష్యురాలి గెలుపుకోసం తపించడం ఇలా చాలానే చాయాలున్నాయి. అయితే మాధవన్ సినిమా తరువాత ఆమీర్ సినిమా వచ్చింది కాబట్టి దంగల్ హిట్ కొట్టగలిగింది.
మరి ఇప్పుడు ఇదే స్టోరీని విక్టరీ వెంకటేష్ గురు పేరిట రీమేక్ చేస్తున్నాడు. ఈ పోలికలు - దంగల్ రీచ్ కారణంగా వెంకీ మూవీకి ఎఫెక్ట్ పడే అవకాశాలు వున్నాయి. ఈ విషయాలని దృష్టిలోపెట్టుకుని గురు టీమ్ ఏమన్నా మార్పులు చేస్తారేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/