ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం అయిన చందంగా .. ఏడాది పాటు ఎంతో శ్రమించి ఎంతో డబ్బు వెదజల్లి తెరకెక్కించిన సినిమాని పైరసీ కారులు కేవలం కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లో లీక్ చేస్తూ సర్వనాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడులు పెట్టిన నిర్మాతలు - పంపిణీదారులు లబోదిబోమనే పరిస్థితి. పైరసీ మాఫియా దందాకు అంతూ దరీ లేకపోవడంతో అన్ని పరిశ్రమలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా తమిళ్ రాకర్స్ మాఫియా ఆగడాలకు అడ్డూ అదుపూ అన్నదే లేకుండా పోయింది. కోలీవుడ్ -టాలీవుడ్ - బాలీవుడ్ పరిశ్రమ ఏదైనా ఆన్ లైన్ టొరెంట్ లింకుల్ని అందిస్తూ తమిళ్ రాకర్స్ మాఫియా ఆటాడుకుంటోంది.
దీనికి అడ్డు కట్ట వేసేందుకు ప్రయత్నించినా ఎవరూ ఆపలేని ధైన్యం నెలకొంది. ఇకపోతే పైరసీ పోటు అనేది కేవలం ఒక కోణం మాత్రమే. మరిన్ని మార్గాల్లోనూ సినీ పరిశ్రమలకు తీవ్ర నష్టం తప్పడం లేదు. ఈసారి సంక్రాంతి సినిమాలకు ఈ తరహా థ్రెట్ ఎదురైంది. ఇప్పటికే అన్ని కొత్త సినిమాల్ని ట్రావెల్ బస్సుల్లో షోలు వేస్తుంటే జనం వాటిని ఆరాంగా ఆస్వాధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈపాటికే సంక్రాంతి సినిమాల్ని ప్రయాణాల్లో ట్రావెల్ బస్సుల్లో వీక్షిస్తున్నారని టాక్ స్ప్రెడ్ అయ్యింది.
ఈ తరహా రెగ్యులర్ ప్రాసెస్ కామనే కదా! అనుకుంటే.. సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన దర్బార్ చిత్రాన్ని ఏకంగా ఓ టీవీ చానెల్లో టెలీకాస్ట్ చేసేయడం కలకలం రేపుతోంది. అత్యుత్సాహమా లేక అలవాట్లో పొరపాటో కానీ మధురైకి చెందిన లోకల్ కేబుల్ శరణ్య టీవీలో దర్బార్ చిత్రాన్ని టెలీకాస్ట్ చేసేశారు. దీంతో సీరియస్ అయిన చిత్రబృందం ముంబై పోలీస్ కమీషనరేట్ కి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం సదరు చానెల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రజనీకాంత్ - నయనతార జంటగా మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ దర్బార్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. జనవరి 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైతే మధురైలో జనవరి 12న శరణ్య చానెల్ టెలీకాస్ట్ చేసేయడం సంచలనమైంది.