టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా.. మాజీ కేంద్రమంత్రిగా పని చేసిన దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ రోజు తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను.. హైదరాబాద్ లోని కిమ్స్ లో చేర్చారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
ఆయన అనారోగ్యం ఇబ్బందికరంగా ఉండటంతో ఆయన్ను ఐసీయూలో చేర్చారు. వైద్యులకు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. దాసరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.
నిన్నటివరకూ హుషారుగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన..అస్వస్థతకు గురైన వైనం టాలీవుడ్ వర్గాలకు షాకింగ్ గా మారింది. మరోవైపు ఆయన తీవ్ర అస్వస్థతతో ఉన్నట్లుగా కొన్ని వర్గాలు చెబుతున్నారు. దీనిపై కిమ్స్ ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/