ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అనారోగ్యంతో మరోసారి కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. జనవరిలో జరిగిన శస్త్రచికిత్స అనంతరం ఇన్‌ఫెక్షన్ సోకడంతో తీవ్ర అస్వస్థతకు లోనైన దాసరి.. 4 రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. . ప్రస్తుతం ఆయనకు కిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ కొనసాగుతోంది, ఈ ఏడాది జనవరిలో దాసరి అన్నవాహికకు కిమ్స్ వైద్యులు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే.
దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్య పరిస్థితిపై కొద్దిసేపట్లో వైద్యులు నివేదికను విడుదల చేయనున్నారు. ఉదయం నుంచి బీపీలో కూడా హెచ్చుతగ్గులు ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారంటున్నారు. డయాలసిస్‌కు ఎలా స్పందిస్తున్నారో చూసిన తర్వాతే హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, శరీరంలోని పలు భాగాలకు ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో గతంలోనే ఆయనకు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత కొన్ని శరీర భాగాలు దెబ్బతిన్నాయని వార్తలు వెలువడ్డాయి.కాగా, దాసరి తొందరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సినీ పరిశ్రమ ఆకాంక్షిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/