ఏకంగా బాహుబలి, శ్రీమంతుడు సినిమాల తర్వాత ఇండస్ట్రీకి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన సినిమా మాదే అంటున్నారు "సినిమా చూపిస్త మావ" టీమ్. పోనివ్ లేండి.. ఒక మాంచి హిట్టు కొట్టారు కాబట్టి.. రాజ్ తరుణ్, అవికాగోర్.. చింపేశారని అనుకుందాం. ఇకపోతే ఈ సినిమాను చూసిన దర్శకరత్న దాసరి కూడా ఓ రేంజులో పొగిడేశారులే.
"మన తెలుగు సినిమా ఆడియన్స్ చాలా మంచివారు. సినిమా నచ్చితే చాలు.. నటీనటులు, భాషతో వారికి సంబంధం లేదు. సినిమా బాగుంటే చాలు ఆదరిస్తారు. ఎప్పుడైనా ఒక పెద్ద సినిమా విజయం సాధిస్తే.. డిస్ట్రిబ్యూటర్లు బాగుపడతారు. కానీ.. చిన్న సినిమా విజయం సాధిస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది. కేవలం 3 కోట్ల రూపాయలతో రూపొందించబడిన "సినిమా చూపిస్త మావ" నేడు 15 కోట్ల రూపాయల్ని వసూలు చేసే స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది'' అంటూ తనదైన శైలిలో సంభాషించారు. బాగానే ఉంది సార్..
ఇక్కడ అర్ధంకాని మ్యటార్ ఏంటంటే.. పెద్ద సినిమా హిట్టయితే పంపిణీదారులు మాత్రమే బాగుపడతారు, చిన్న సినిమాలు హిట్టయితే ఇండస్ర్టీ బాగుపుడుతంది. హౌ సార్? ఎలా? 100 కోట్ల బడ్జట్ సినిమాలు ఆడుతుంటే, ఇంకా ఎక్కువమంది అలాంటి సినిమాలు తీస్తుంటారు. అప్పుడు ఎక్కువ మంది సినిమా కార్మికులకు పని దొరుకుతుంది. కాని చిన్న సినిమా ఆడితే, చిన్న సినిమాలే అందరూ తీస్తే, అవి లో-బడ్జెట్ సినిమాలు కావడంతో పెద్దగా వేతనాలు ఉండవ్. స్టాఫ్ తక్కువమందే చాలు. ఇక 3 కోట్లతో తీసి 15 కోట్లు తెస్తే... నిర్మాతలకు ఫుల్ ప్రాఫిట్టు కాని, ఇండస్ర్టీ బాగుపడేది ఏముంటుంది? ఏంటో మరి దాసరి గారి లాజిక్.. అర్ధం కాలేదు సార్!!