గవర్నమెంట్ లో దావూద్ ఇబ్రహీం

Update: 2016-01-30 10:31 GMT
సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని తన సినిమాకి సూపర్ క్రేజ్ తెచ్చేసుకుంటాడు రామ్ గోపాల్ వర్మ. మామూలుగానే మాంచి పేస్ మీద ఉండే వర్మ.. ఇప్పుడు వీరప్పన్ హిట్ ఇచ్చిన జోష్ తో మరింత స్పీడ్ పెంచేశాడు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూనే.. సెన్సేషన్స్ స్టార్ట్ చేసేశాడు. వర్మ తీయబోయే మరుసటి మూవీకి టైటిల్ 'గవర్నమెంట్'. ప్రభుత్వం అని పేరు పెట్టడంలో అందులో ఉన్న అడ్డగోలు వ్యవహారాలను ఆన్ స్క్రీన్ పై చూపించబోతున్నాడని ఫిక్స్ అవచ్చు.

కానీ ఇక్కడితో ఆగిపోతే అది వర్మ స్టైల్ ఎలా అవుతుంది? అందుకే తన మూవీలో ఒక కేరక్టర్ దావూద్ ఇబ్రహీం అంటూ అసలు విషయం బైట పెట్టాడు. అండర్ వరల్డ్ డాన్ ని ఓ కేరక్టర్ చేసి, సినిమాకి గవర్నమెంట్ అని పేరు పెట్టాడంటే.. రెండింటికీ మధ్య ఉన్న రిలేషన్ ని బైట పెట్టనున్నాడన్న మాట వర్మ. అది కూడా సాధారణంగా కాదు.. 'వీరప్పన్ జీవితాన్ని ఎంత రియలిస్టిక్ గా చూపించానో.. ప్రభుత్వాన్ని దావూద్ ఇబ్రహీం -  చోటా షకీల్ - అబూ సలేంలు ఎలా వణికించారు, వాడుకున్నారో కూడా అంతే వాస్తవంగా తెరకెక్కిస్తా'నని చెప్పాడు రాంగోపాల్ వర్మ.

సింపుల్ గా చెప్పాలంటే.. నేరాలను ఓ ఉద్యోగం మాదిరిగా నేరప్రపంచం చేస్తుంటే.. ప్రభుత్వాలు తమ విధులను నేరాలతో ఎలా నింపేస్తున్నాయన్నది అసలు కాన్సెప్ట్ అట. త్వరలో ఈ మూవీకి సంబంధించిన నటీనటులను అనౌన్స్ చేయబోతున్నారు. అవినీతి అంటూ చాలానే సినిమాలు మన దేశంలో వచ్చాయి కానీ.. వాటిని వర్మ తీస్తే ఆ కిక్కే వేరప్పా.

Tags:    

Similar News