ట్రైలర్ టాక్: ఏజ్ బార్ లవ్ స్టొరీ

Update: 2019-04-02 08:30 GMT
బాలీవుడ్ లో కొత్త తరహా కథలు వెల్లువెత్తున్నాయి. గత ఏడాది లేట్ ఏజ్ లో ఓ అమ్మ గర్భం దాల్చడం గురించి బదాయి హో తీస్తే అది కాస్త బ్లాక్ బస్టర్ అందుకుంది. అందులో స్టార్స్ లేకపోయినా ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇప్పుడు మెల్లగా స్టార్లు కూడా అదే దారిలో పడుతున్నారు. అజయ్ దేవగన్ నటిస్తున్న దే దే ప్యార్ దే ట్రైలర్ ఇందాకా విడుదలైంది. ముందు కథ చూద్దాం.

ఆశిష్(అజయ్ దేవగన్)వయసు 50.పాతికేళ్ల వయసులోనే పెళ్ళైనా ఇద్దరు పిల్లలు పుట్టిన తక్కువ సమయంలోనే మంజు(టబు)తో విడాకులు తీసుకుని ఒంటరిగా గడుపుతూ ఉంటాడు. కొత్తగా అయేషా(రకుల్ ప్రీత్ సింగ్)అనే అమ్మాయితో పరిచయం మెల్లగా ప్రేమకు దారి తీస్తుంది. అందరూ దెప్పి పొడుస్తున్నా ఆశిష్ అయేషాలు పీకల్లోతు ప్రేమలో పడిపోతారు.

ఈ లోపు తన తల్లితండ్రుల కోసం ఊరికి అయేషాతో వెళ్లిన ఆశిష్ కు అక్కడ మంజుతో పాటు వయసుకొచ్చిన ఇద్దరు పిల్లలు నాన్న కోసం వచ్చేస్తారు. అక్కడినుంచి ఆశిష్ కు కొత్త కష్టాలు మొదలవుతాయి. ఒకవైపు వయసు మీరిన మాజీ భార్య మరోవైపు లేత గులాబీ లాంటి కొత్త ప్రియురాలు. వీటి మధ్య ఎలా నెగ్గుకువచ్చాడు అనేదే దే దే ప్యార్ దే

ట్రైలర్ మొత్తం సరదాగా ఉంది. ఏజ్ బార్ లవర్ గా అజయ్ దేవగన్ అద్భుతంగా కట్టిపడేసాడు. రకుల్ కూడా ముసలాడిని ప్రేమించే పాత్రలో ఒదిగిపోయింది. మాజీ భార్యగా టబు యాప్ట్ గా ఉంది. సీన్స్ ఫ్రెష్ గా అనిపిస్తున్నాయి. రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రొమాన్స్ గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ మీద దర్శకుడు అకివ్ అలీ రాసుకున్న కథలో వైవిధ్యం ఉంది. ఎంటర్ టైన్మెంట్ కి లోటు లేకుండా అన్ని బాగా దట్టించినట్టు కనిపిస్తోంది. గోల్ మాల్ తర్వాత ఆ స్థాయి కామెడీని అజయ్ ఇందులో పండించాడు. సుధీర్ కె చౌదరి ఛాయాగ్రహణం అందించిన ఈ మూవీకి ఏడుగురు సంగీత దర్శకులు పాటలు కంపోజ్ చేయడం విశేషం. మే 17న విడుదల కానున్న దే దే ప్యార్ దే ట్రైలర్ మంచి ఇంప్రెషన్ అయితే కలిగించింది.


Full View

Tags:    

Similar News