కామ్రేడ్ కు మండే షాక్

Update: 2019-07-30 10:30 GMT
ఐదు రాష్ట్రాల్లో ప్రచారం ఆరు చోట్ల గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు లెక్కబెట్టుకోలేనన్ని మీడియా ఇంటర్వ్యూలు ఇవేవి డియర్ కామ్రేడ్ ను డివైడ్ టాక్ నుండి కాపాడలేకపోతున్నాయి. ఏ హీరో ఏ సినిమాకు చేయనంత పబ్లిసిటీ చేసిన విజయ్ దేవరకొండకు దానికి తగ్గ ఫలితం సగం కూడా రాదని తేలిపోయింది. మొదటి మూడు రోజులు సుమారు 19 కోట్ల దాకా షేర్ తో ఓమాదిరిగా పర్వాలేదు అనిపించుకున్నా ఆ తర్వాత సోమవారం నుంచి దారుణమైన  డ్రాప్ ఉండటం బయ్యర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. సోమవారం కేవలం 93 లక్షలు మాత్రమే షేర్ రావడం పరిస్థితికి అద్దం పడుతోంది.

బోనాల పండగ సందర్భంగా తెలంగాణా మొత్తం సెలవు రోజే అయినప్పటికీ అది కామ్రేడ్ కు ఏ రకంగానూ ఉపయోగపడలేదు. రివర్స్ లో ఇస్మార్ట్ శంకర్ పండగ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ లాంటి హీరోకు నాలుగో రోజు షేర్ అంత తక్కువ రావడం చిన్న విషయం కాదు. యుఎస్ లో సైతం దీనికి భిన్నంగా ఏమి లేదు. మిలియన్ మార్క్ ఆమడ దూరంలో నిలిచిపోయింది.

అతి కష్టం మీద $700K అందుకున్న కామ్రేడ్ ఇంకో మూడు లక్షల డాలర్లు రాబట్టడం అంటే మాటలు కాదు. అక్కడి డిస్ట్రిబ్యూటర్ ఇప్పటికే నష్టాలు లెక్కేసుకునే పనిలో పడ్డట్టు వినికిడి.ఇక ఎంత పబ్లిసిటీ చేసినా ఆల్రెడీ నెగటివ్ గా మారిపోయిన డివైడ్ టాక్ నుంచి కామ్రేడ్ ను బయటికి తీసుకురావడం కష్టమే. ఇప్పుడున్న నాలుగు రోజులు ఇంకా భారంగా గడవనున్నాయి. శుక్రవారం గుణ 369తో పాటు రాక్షసుడు వస్తున్నాయి. సో కామ్రేడ్ కు రాబోయే వీకెండ్ కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ లేనట్టే.

    

Tags:    

Similar News