'డియర్ మేఘ' కు కలిసొచ్చే అంశాలు..!

Update: 2021-08-31 12:30 GMT
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత థియేటర్లలో ప్రతీవారం అర డజను చిన్న సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ శుక్రవారం (సెప్టెంబర్ 3) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాల్లో ''డియర్ మేఘ'' కూడా ఉంది. మేఘా ఆకాష్ - అరుణ్ ఆదిత్ - అర్జున్ సోమయాజుల ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ - టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకుని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఏసియన్ సినిమాస్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో గ్రాండ్ గా ''డియర్ మేఘ'' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మంచి ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా క్లీన్ 'యూ' (U) సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్. అలానే ఈ సినిమా నిడివి కూడా 124 నిమిషాలు ( 2గంటల 4 నిమిషాలు) మాత్రమే అని తెలుస్తోంది. ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కి అలవాటు పడిపోయిన ఈరోజుల్లో.. వారిని రెండున్నర మూడు గంటల పాటు థియేటర్లలో కూర్చోబెట్టడం ఫిలిం మేకర్స్ కు కష్టంగా మారింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు 'డియర్ మేఘ' చిత్రాన్ని క్రిస్పీ రన్ టైంలో జనాలకు చూపించాలనుకోవడం సరైన నిర్ణయమనే చెప్పాలి. ఈ ముక్కోణపు ప్రేమకథతో మంచి ఎమోషన్స్ ఉన్నందున ఈ సినిమా ఆడియన్స్ ని కచ్చితంగా అలరిస్తుందని చిత్ర బృందం ధీమాగా ఉన్నారు. ఇటీవల 'రాజ రాజ చోర' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోయిన్ మేఘా ఆకాష్.. ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. కొత్త దర్శకుడు ఎ.సుశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించాడు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ సినిమాని నిర్మించారు.

'డియర్ మేఘ'' చిత్రానికి హరి గౌర సంగీతం సమకూర్చారు. ఐ. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. పీఎస్ వర్మ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇక సెప్టెంబర్ 3న శ్రీనివాస్ అవసరాల 'నూటొక్క జిల్లాల అందగాడు' తో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాయి. వీటిలో ఏవేవి ప్రేక్షకాదరణ దక్కించుకుంటాయో చూడాలి.


Tags:    

Similar News