తెలుగు ప్రేక్షకులు మరియు ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించిన కన్నడ సినిమా ''దియా''. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ చిత్రం ఫీల్ గుడ్ మూవీగా ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి ''డియర్ మేఘ'' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఇందులో మేఘా ఆకాష్ - అరుణ్ ఆదిత్ - అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎ.సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ నిర్మిస్తున్నారు.
వాస్తవానికి నిర్మాతలు సినిమా రీమేక్ రైట్స్ తో పాటుగా డబ్బింగ్ రైట్స్ కూడా తీసుకుంటారు. అయితే 'డియర్ మేఘ' విషయంలో వేరేగా జరిగింది. నిర్మాతలు రీమేక్ రైట్స్ కొనే లోపే.. 'దియా' ప్రొడ్యూసర్ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ఇంకొకరికి అమ్మేశారు. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇరువర్గాలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటారు. కానీ ఇక్కడ 'డియర్ మేఘ' టీమ్ కి డబ్బింగ్ రైట్స్ కొనుకున్న బృందానికి మధ్య సరైన సెటిల్మెంట్ అవ్వలేదని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో 'డియర్ మేఘ' రిలీజ్ టైమ్ లోనే 'దియా' తెలుగు డబ్బింగ్ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తుండటం గమనార్హం. 'దియా' చిత్రాన్ని ఆగస్టు 19న రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. కాకపోతే ఈ ట్రైయాంగిల్ ప్రేమ కథను థియేట్రికల్ రిలీజ్ చేయకుండా.. డిజిటల్ స్ట్రీమింగ్ కి పెడుతున్నారని తెలుస్తోంది. ఈమేరకు సోమవారం ప్రసాద్ లాబ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేశారు. దీంతో ఇప్పుడు ఓవైపు రీమేక్ వెర్షన్ థియేటర్స్ లో విడుదల అవుతుంటే.. మరోవైపు డబ్బింగ్ వెర్షన్ ఓటీటీలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది.
ఇదే వ్యవహారం ఇప్పుడు 'డియర్ మేఘ' మేకర్స్ కు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. అరుణ్ అదిత్ - మేఘా ఆకాష్ లతో చేస్తున్న ఈ చిత్రం ఎలాంటి ఓపెనింగ్స్ తెచ్చిపడుతుందో అని నిర్మాతలు ఆలోచిస్తుంటే.. పుండు మీద కారం చల్లినట్లుగా 'దియా' తెలుగు డబ్బింగ్ గోల పెద్ద తలనొప్పిగా మారిందని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. కాగా, 'దియా' చిత్రానికి కె.ఎస్.ఎస్ అశోక దర్శకత్వం వహించగా.. ఖుషీ రవి - పృథ్వీ అంబర్ - దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించారు. మరోవైపు 'డియర్ మేఘ' చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. మరి ఈ రెండు చిత్రాల్లో దేనికి ప్రేక్షకాదరణ దక్కుతుందో చూడాలి.