మేఘా ఆకాష్ - అరుణ్ ఆదిత్ - అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ''డియర్ మేఘ''. కొత్త దర్శకుడు ఎ.సుశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ తెరుచుకోవడంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.
'డియర్ మేఘ' సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసినట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ 'యూ' (U) సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దాదాపు 300 థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు.
ఈ నేపథ్యంలో 'డియర్ మేఘ' మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మెదలు పెట్టారు. మంచి ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసు దోచుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ చిత్రంలో పవిత్రా లోకేష్ కీలక పాత్ర పోషించారు. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రాన్ని నిర్మించారు.
'డియర్ మేఘ'' చిత్రానికి హరి గౌర సంగీతం సమకూర్చారు. ఐ. ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. పీఎస్ వర్మ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన చిత్రాలకు ప్రేక్షకాదరణ లభిస్తున్న నేపథ్యంలో.. భావోద్వేగ ప్రేమ కథగా రూపొందిన 'డియర్ మేఘ' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.